Pithapuram: పిఠాపురంలో పొలిటికల్ హీట్.. పవన్‌పై బ్రహ్మాస్త్రాలను ప్రయోగిస్తున్న వైసీపీ..!

పిఠాపురంలో పవన్‌ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. మండలాల వారీగా ఇన్‌ఛార్జులను నియమించింది. గొల్లప్రోలులో కాపు నాయకులతో ముద్రగడ రహస్య భేటీ అయ్యారు. మరోవైపు యు.కొత్తపల్లి మత్స్యకార నాయకులతో దాడిశెట్టి రాజా మీటింగ్‌ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

New Update
Pithapuram: పిఠాపురంలో పొలిటికల్ హీట్.. పవన్‌పై బ్రహ్మాస్త్రాలను ప్రయోగిస్తున్న వైసీపీ..!

Also Read: చంద్రబాబు బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ వాయిదా..!

గొల్లప్రోలు మండలానికి ఇన్‌ఛార్జిగా కురసాల కన్నబాబు, యు.కొత్తపల్లి మండలానికి మంత్రి దాడిశెట్టి రాజాను నియమించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. నియోజకవర్గ కాపు నాయకుల కోసం ముద్రగడ రంగంలోకి దిగారు. గొల్లప్రోలులో కాపు నాయకులతో రహస్యంగా భేటీ అయ్యారు. ఎన్నికల వ్యూహాలను అమలు చేసేందుకు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి యు.కొత్తపల్లి మత్స్యకార నాయకులతో మీటింగ్‌ నిర్వహిస్తున్నారు.

Also Read: అహంకారంగా అపర్ణ.. కొడుకు కాపురాన్ని నిలబెడుతుందా.. కావ్య పరిస్థితి ఏంటి?

ఇదిలా ఉండగా.. పిఠాపురం టీడీపీ టికెట్ మొదట తనదేనని ఆర్టీవీతో ఎక్స్ క్లూజీవ్ గా మాట్లాడారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అడగడంతోనే తాను టికెట్ త్యాగం చేశానన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయానికే కట్టుబడి ఉన్నానని.. టీడీపీ నేతలతో కలిసి పవన్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు. పవన్ ఒకవేళ పార్లముంట్ కి వెళితే ఇక్కడి టిక్కెట్ తనదేనని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే పవన్ ను తాను కలిసినట్లుగా ఫొటోలు వైరల్ చేస్తున్నారని.. అయితే, అది 2014 ఎన్నికల తర్వాత కలిసి దిగిన ఫొటో అని స్పష్టం చేశారు. అప్పటి ఫొటోను ఇప్పుటదిగా ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

Advertisment
తాజా కథనాలు