పవర్ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్..మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.!

విశాఖలో వైసీపీ సామాజిక సాధికార యాత్ర నిర్వహించారు.ఈ సందర్భంగా వైసీపీ ముఖ్యనేతలు మాట్లాడుతూ.. మైనార్టీల ఆత్మ గౌరవంను చంద్రబాబు తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవర్ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ ధ్వజమెత్తారు.

New Update
పవర్ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్..మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.!

YCP: విశాఖలో వైసీపీ సామాజిక సాధికార యాత్ర కార్యక్రమంను నిర్వహించింది. మంత్రి సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మంత్రి విశ్వరూప్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. మత్స్యకారులను చంద్రబాబు బెదిరించారని అన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఆత్మ గౌరవంను చంద్రబాబు తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటిపై టిడిపి జెండా కడితేనే పథకాలు ఇచ్చేవారని వ్యాఖ్యనించారు. విశాఖ ను రాజధాని కాకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతిని రాజధాని గా చేశారని అన్నారు.

Also read: రోడ్ల దుస్థితిపై రోడ్డెక్కిన జనసేన-టీడీపీ.!

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ..జనసేన అధినేత పవన్ పై ఫైర్ అయ్యారు. పవర్ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ ఎద్దెవ చేశారు. అబద్ధాలు మోసాలకు ప్రజలు ప్రలోభం కావొద్దని సూచించారు. లోకేష్ ఒక పులకేశని..తండ్రి జైల్ లో ఉంటే ఢిల్లీ పారిపోయిన వ్యక్తి అని కౌంటర్లు వేశారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు పాలనకు.. సీఎం జగన్ పాలనకు ఉన్న తేడాను ప్రజలు గమనించాలని కోరాడు మంత్రి విశ్వరూప్. రైతు డ్వాక్రా రుణ మాఫీ చేస్తామని చంద్రబాబు మోసం చేశారని అన్నారు. రైతు రుణ మాఫీ కి చంద్రబాబు తూట్లు పొడిచారని మండిపడ్డారు. ధర్మ శ్రీ మాట్లాడుతూ..వెలగపూడి రామకృష్ణపై నిప్పులు చెరిగారు. బ్రాందీ వ్యాపారంతో ప్రజలను మోసం చేసిన ఘనత వెలగపూడిదని అన్నారు. మడ్డర్ మోసాలు చేసిన వెలగపూడితో ప్రమాదని వ్యాఖ్యనించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు