AP: అంబేద్కర్ విగ్రహం ఎదుట వైసీపీ శ్రేణుల ధర్నా.!

కాకినాడ జిల్లా పిఠాపురంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట వైసీపీ శ్రేణులు ధర్నా చేశారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహ శిలాఫలకాలన్ని ధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

AP:  అంబేద్కర్ విగ్రహం ఎదుట వైసీపీ శ్రేణుల ధర్నా.!
New Update

Kakinada: కాకినాడ జిల్లా పిఠాపురంలో అంబేద్కర్ విగ్రహం (Dr BR Ambedkar Statue) ఎదుట వైసీపీ శ్రేణులు ధర్నా చేశారు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహ శిలాఫలకాలను, శృతి వనాన్ని ధ్వంసం చేయడం చాలా దురదృష్టకరమన్నారు. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తమకు వైయస్ జగన్ (YS Jagan) అంకితం చేశారని.. పోలీసులు ఉండగానే కొందరు శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిని వైసీపీ దళిత నాయకులు తీవ్రంగా ఖండించారు.

Also Read: సినిమా స్టైల్‌లో భర్తను హత్య చేయించిన భార్య .. మెడకు తాడు బిగించి..

ప్రపంచవ్యాప్త మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరూ మన్ననలను పొందుతన్నారని.. కానీ మన దేశంలో మాత్రం ఇలా అంబేద్కర్ విగ్రహాలపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దేశానికి దశా దిశా చూపించిన వ్యక్తి అని.. అలాంటి మహనీయుడి విగ్రహాన్ని దాడి చేసేలా రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో నడుస్తుందని మండిపడ్డారు.

Also Read: సెల్‌ఫోన్ సిగ్నల్ లేని ఊరు.. 108కు ఫోన్ చేయాలన్నా ఇబ్బందే..!

ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. లేదంటే  రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు. సీఎం డౌన్ డౌన్, ప్రభుత్వ దుష్ట చర్యలు మానుకోవాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వైసీపీ శ్రేణులు ఆందోళన చేశారు. గతంలో తమ ప్రభుత్వం చట్టబద్ధంగా ఒక పద్ధతి ప్రకారం పేర్లను మార్చిందని.. ఇలా దౌర్జన్యంగా శిలాఫలకాలు ధ్వంసం చేసి పేర్లు మార్చలేదన్నారు.

#latest-news-in-telugu #ap-news #kakinada
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe