Andhra Pradesh : అంబేద్కర్ విగ్రహంపై దాడి.. వైసీపీ శ్రేణుల నిరసన..!

విజయవాడలో అంబేద్కర్‌ విగ్రహంపై దాడికి నిరసనగా కడపలో వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహంపై జరిగిన దాడి హేయమైన చర్య అని కొవ్వొత్తులతో నిరసన చేశారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

New Update
Andhra Pradesh : అంబేద్కర్ విగ్రహంపై దాడి.. వైసీపీ శ్రేణుల నిరసన..!

Kadapa : విజయవాడ (Vijayawada) లో అంబేద్కర్‌ విగ్రహం (Ambedkar Statue) పై దాడి హేయమైన చర్య అన్నారు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. అంబేద్కర్ విగ్రహంపై జరిగిన దాడిని నిరసిస్తూ వైసీపీ నాయకులు కడపలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ కేవలం ఒక కులానికి, మతానికి సంబంధించిన వ్యక్తి కాదని.. ప్రపంచం వ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి చెందిన మహనీయుడని కొనియాడారు.

Also Read: రోడ్డు ప్రమాదం కాదు.. కావాలనే నేనే ఇలా చేశా.. దివ్వల మాధురి సంచలన వ్యాఖ్యలు..

అటువంటి వ్యక్తి విగ్రహాన్ని కూల్చేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ (YCP) హయాంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ (YS Jagan) విజయవాడలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని.. ఈ విగ్రహం భావితరాలకు స్ఫూర్తిగా, దిక్సూచిగా నిలిచిందన్నారు. కానీ, ఈ కూటమి ప్రభుత్వం ఈర్ష్యతోనే ఇలా అంబేద్కర్‌ విగ్రహంపై దాడికి పాల్పడిందని ఆరోపించారు.

Also Read: పాపం.. శ్మశానవాటికకు దారి లేక..

నగరం నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం ఉండకూడదన్నదే ఈ ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. అందుకే విగ్రహంపై దాడి చేసే ప్రయత్నం చేశారని.. రేపో, మాపో అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చి వేసే అవకాశం కూడా ఉందని అంజాద్ బాషా అన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఘటనపై విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Advertisment
తాజా కథనాలు