AP Politics: టీడీపీపై మండిపడ్డ బొత్స, వైవీ సుబ్బారెడ్డి..బస్సుయాత్రతో ప్రజల్లోకి వెళ్తామని వెల్లడి

ఏడాది కాలంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గడప గడపకు కార్యక్రమం ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తోంది, ఈ సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సుయాత్రను చేపట్టనున్నారు. అక్టోబర్‌ 26 నుంచి నవంబర్‌ 9వ తేదీ వరకు ఈ సామాజిక సాధికార బస్సుయాత్ర కొనసాగుతుందని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

YV Subba Reddy: సీఎం ఆఫీసులోకి వచ్చిన కంటైనర్.. ఏముందో చెప్పిన వైవీ సుబ్బారెడ్డి!
New Update

రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి.. సాయంత్రం బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంతేకాకుండా 70 శాతం బీసీ, ఎస్సీ మైనారిటీలకు ప్రాధాన్యత ఇస్తామని, వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధిక మెజార్టీతో గెలిపించి జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలను అభ్యర్థిస్తామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ప్రారంభమయ్యే ఈ బస్సు యాత్ర 27న గజపతినగరం, మూడో రోజు భీమిలి, పాడేరు, పార్వతీపురం, మాడుగుల, ఎస్ కోట, అనకాపల్లితో యాత్ర ముగస్తుందని, రెండో దశ బస్సుయాత్ర దీపావళి తర్వాత మొదలవుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, గిరిజన, మైనారిటీలు మద్దతివ్వాలని వైవీ సుబ్బారెడ్డి కోరారు.

ఇది కూడా చదవండి: బిజినెస్ మ్యాన్ కిడ్నాప్… కోట్లు డిమాండ్ చేసిన కిలాడీ దంపతులు

మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ మూడు ప్రాంతాలుగా విభజించారని, 13 రోజులు తొలి దశ యాత్ర ఉంటుందన్నారు. చెప్పిన హామీలు అమలు చేసిన తర్వాత ప్రజల్లోకి వెళ్తున్నామని, అనేక ఎన్నికల్లో వైసీపీ గెలిచిందని చెప్పారు. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి జగన్ మోహన్‌రెడ్డి చేశారని, వెయ్యి నుంచి 1400 కోట్ల రూపాయల వరకు ఒక్కో నియోజకవర్గంలో సంక్షేమం అమలు చేస్తున్నామని బొత్స అన్నారు. అంతేకాకుండా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తెచ్చి అందరికీ వైద్యం అందించే ప్రభుత్వం తమదని, మిగతా రాజకీయ పార్టీలు గతంలో ఒక్క పనీ చేయలేదని, తెలుగుదేశం పార్టీ 14 ఏళ్ల పాలనలో శాశ్వత ప్రాతిపదికన ఒక్క పనీ చేయేదని మండిపడ్డారు.

డిబేట్‌ పెడతామంటూ సవాల్‌

పుంగనూరులో జరిగిన ఘటన యెక్క పూర్వా పరాలు తెలుసుకోవాలని, అక్కడ టీడీపీ వాళ్లు ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారో పూర్తిగా కొనుక్కోవాలని ఆ తర్వాత డిబేట్‌ పెడతామంటూ సవాల్‌ విసిరారు. రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో మాకు మేమే సీబీఐ విచారణ వేసుకున్న చరిత్ర ఉందని, బైజ్యూస్ వారికి ఏ విద్యార్థి ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదని బొత్స స్పష్టం చేశారు. కనుచూపు మేరలో టీడీపీ, జనసేనకు అవకాశాలు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఎంసెట్‌లో రెండు విడతలు మాత్రమే ఉంటాయని, మూడో విడత ఉండదని ముందే చెప్పామని, లాస్ట్ ఇయర్ 330 మంది మాత్రమే మూడవ కౌన్సిలింగ్‌లో జాయిన్‌ అయ్యారని బొత్స చెప్పారు.

#bus-trip #vishaka #ap-politics #minister-botsa-satyanarayana #yv-subbareddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి