Jagan: ఎమ్మెల్యేగా మాజీ సీఎం జగన్ రాజీనామా.. క్లారిటీ!

AP: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా జగన్ పోటీ చేయనున్నారని జరుగుతున్నా ప్రచారానికి చెక్ పెట్టారు వైసీపీ నేత సురేష్ బాబు. అదంతా తప్పుడు ప్రచారం అని కొట్టిపారేశారు. కావాలనే కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

New Update
Jagan: ఎమ్మెల్యేగా మాజీ సీఎం జగన్ రాజీనామా.. క్లారిటీ!

Jagan:గత కొన్ని రోజులుగా పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్ జగన్ రాజీనామా చేస్తాడని, కడప ఎంపీ గా వైఎస్ అవినాష్ రాజీనామా అంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు. ఇలాంటి దుష్ప్రచారం చేయడం దారుణం అని అన్నారు. కాగా నిన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కడపలో ఉప ఎన్నిక జరుగుతుందని చెప్పడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సురేష్ బాబు.

2011లో జరిగిన కడప పార్లమెంట్ ఉప ఎన్నికలలో కడప దెబ్బ డిల్లి అబ్బా అనేలా ప్రజల తీర్పు ఇచ్చారని అన్నారు. వైఎస్ జగన్ కు వచ్చిన మెజారిటీ ఒక చారిత్రాత్మకం అని చెప్పారు. ఇది దేశమంతా చూశారని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ఏదో కడప ఉప ఎన్నిక అంటూ తప్పుడు కథనాలు రాగానే రేవంత్ రెడ్డి స్పందించడం సిగ్గుచేటు అని ఫైర్ అయ్యారు.

#jagan
Advertisment
తాజా కథనాలు