Vishaka: విశాఖలో వైసీపీ కార్యకర్తల సమావేశంలో గందరగోళం.! విశాఖలో గాజువాక నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల సమావేశంలో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యే నాగిరెడ్డి కుటుంబానికే టికెట్ కేటాయించాలని కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. By Jyoshna Sappogula 30 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Vishaka YCP Meeting: అధికార పార్టీ వైసీపీకి అసంతృప్తి సెగలు మరింత కాక రేపుతున్నాయి. సీటు మాకు కావాలంటే మాకు కావాలంటూ కొందరు నేతలు పట్టుబడుతున్నారు. మరోవైపు సీఎం జగన్(CM Jagan) మాత్రం వైసీపీ ఇన్చార్జుల మార్పుపై కసరత్తు కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, గాజువాక నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల సమావేశంలో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యే నాగిరెడ్డి కుటుంబానికే టికెట్ కేటాయించాలని కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. Also Read: ప్రధాని నరేంద్ర మోడీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ.! నాగిరెడ్డి కుటుంబానికే సీటు ఇవ్వాలని ఆందోళన చేశారు. జై జగన్.. జై టిఎన్ఆర్ అంటూ అరుపులు కేకలు పెట్టారు. అక్కడ ఉన్న వైసీపీ నేతలు సైతం వారిని కంట్రోల్ చేయలేకపోయారు. కీలక నేత సుబ్బారెడ్డిని సైతం మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారు గాజువాక నాయకులు, కార్యకర్తలు. దీంతో, సభ మొత్తం గందరగోళం నెలకొంది. Your browser does not support the video tag. Also Read: ఉప్పల్ లో దారుణం.. భార్యను వీడియోకాల్ లైవ్ లో ఉంచి భర్త ఏం చేశాడంటే.. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కొంత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీటు ఇస్తారో ఇవ్వరో అని టెన్షన్ పడుతుండుగా..మరోవైపు ఈసారి అయిన కచ్చితంగా సీటు ఇవ్వాలంటూ వైసీపీ ముఖ్యనేతలు కొందరూ పట్టుబడుతున్నారు. అడిగినట్టు సీటు ఇస్తే ఉంటున్నారు. సీటు ఇవ్వలేరు అని తెలిసికా అధికార పార్టీ వైసీపీ పై అసహనం వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామ చేసేస్తున్నారు. ఆ తరువాత పక్క పార్టీల వైపు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే, కొందరు వైసీపీ ముఖ్యనేతలు..కొందరూ టీడీపీ వైపు, మరికొందరూ జనసేన పార్టీ వైపు అడుగులు వేశారు. #andhra-pradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి