Kurnool : కర్నూలు జిల్లాలో రాజకీయ హత్య కలకలం రేపింది. మహానంది మండలం సీతారామపురంలో దారుణ హత్య జరిగింది. వైసీపీ (YCP) నేత సుబ్బారాయుడును దుండగులు రాళ్లతో కొట్టి, నరికి చంపారు. గ్రామానికి చెందిన టీడీపీ (TDP) నేతలే చంపారని మృతుడి భార్య ఆరోపణ చేస్తోంది. ఎన్నికల సమయంలో వైసీపీకి మద్దతుగా పని చేయడంతోనే సుబ్బారాయుడిని హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. మృతుడు సుబ్బారాయుడు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి (Silpa Chakrapani) కి అనుచరుడు. ఈ క్రమంలో గ్రామంలో శాంతిభద్రతలు దెబ్బ తినకుండా పికెట్ ఏర్పాటు చేశారు పోలీసులు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహం నంద్యాల ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
పూర్తిగా చదవండి..YSRCP : వైసీపీ నేత దారుణ హత్య
AP: కర్నూలు జిల్లాలో రాజకీయ హత్య కలకలం రేపింది. మహానంది మండలం సీతారామపురంలో దారుణ హత్య జరిగింది. వైసీపీ నేత సుబ్బారాయుడును దుండగులు రాళ్లతో కొట్టి, నరికి చంపారు. గ్రామానికి చెందిన టీడీపీ నేతలే చంపారని మృతుడి భార్య ఆరోపణ చేస్తోంది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Translate this News: