Mudragada Padmanabham: ముద్రగడ కాదు ముద్రగడ పద్మనాభ రెడ్డి!

AP: ముద్రగడ పద్మనాభం మాట నిలబెట్టుకున్నారు. ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్నారు. పవన్‌ కళ్యాణ్ గెలిస్తే ముద్రగడ రెడ్డిగా పేరు మార్చుకుంటానని ఎన్నికల ముందు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పవన్ గెలవడంతో ముద్రగడ రెడ్డిగా ఆయన పేరు మార్చుకున్నారు.

Mudragada Padmanabham: ముద్రగడ కాదు ముద్రగడ పద్మనాభ రెడ్డి!
New Update

Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభం మాట నిలబెట్టుకున్నారు. ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్నారు. పవన్‌ కళ్యాణ్ గెలిస్తే ముద్రగడ రెడ్డిగా పేరు మార్చుకుంటానని ఎన్నికల ముందు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కళ్యాణ్ కల్యాణ్ భారీ మెజారితో పిఠాపురం లో గెలిచారు. అలాగే జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో జనసేన అభ్యర్థులు అన్ని స్థానాల్లో విజయం సాధించారు.

కాపు నేతగా ఉన్న ముద్రగడ పద్మనాభం ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తూ వైసీపీలో చేరారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని శపథం చేశారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే... తాను తన పేరును ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటానని సవాల్ చేశారు. ఎన్నికల్లో పవన్ గెలవడం.. వైసీపీ ఓటమి చెందడంతో ముద్రగడపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ విపరీతంగా పెరిగింది. పేరు మార్చుకోవాలంటూ జనసైనికుల ఒత్తిడి చేశారు. కాగా ఎన్నికల్లో చేసిన సవాల్ ను స్వీకరిస్తూ మాట ప్రకారం పేరు మార్చుకున్నారు ముద్రగడ.

ఎన్నికల్లో ఓటమి అనంతరం మీడియా ముందుకు వచ్చారు ముద్రగడ. ఆయన మాట్లాడుతూ..”పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని.. నేను ఓటమి చెందాను. అన్నమాట ప్రకారం నా పేరును ముద్రగడ పద్మనాభరెడ్డి గా మార్చమని గెజిట్ పబ్లికేషన్ కోసం అంత రెడీ చేసుకున్న.” అని అన్నారు. 

#mudragada-padmanabham
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe