/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/JAGAN-ATTACK.jpg)
Jagan: మాజీ సీఎం జగన్ కడప పర్యటనలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న కడప రిమ్స్ ఆసుపత్రిలో టీడీపీ నేతల దాడులలో గాయపడ్డ వైసీపీ నేత అజయ్ రెడ్డిని పరామర్శించేందుకు వెళ్లిన జగన్ ను చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ క్రమంలో ఓ అభిమాని జగన్ పైకి దూసుకొచ్చాడు. జగన్ ను హత్తుకునేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన భద్రత సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
జగన్ పై దాడి అంటూ ప్రచారం..
నిన్న కడపలో జగన్ పై జరిగిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జగన్ పై వైసీపీ కార్యకర్త దాడికి ప్రయత్నించాడని సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. "నీ వల్లే మా వైఎస్ఆర్ కి చెడ్డ పేరు అంటూ.... పులివెందులలో జగన్ ని కొట్టటానికి వైఎస్ఆర్ అభిమాని వెళ్లాడని ప్రచారం చేస్తున్నారు. టీడీపీ శ్రేణులు చేస్తున్న ప్రచారాన్ని వైసీపీ ఖండించింది. జగన్ పై ప్రజల్లో వ్యతిరేకత తెచ్చేందుకు టీడీపీ చేస్తున్న విష ప్రచారం అంటూ మండిపడింది. అయితే, తాను జగన్ అభిమానిని అని.. జగన్ ను కలిసేందుకు అక్కడి వచ్చినట్లు అతడు తెలిపాడు.
జగన్ పై దాడికి ప్రయత్నించిన వైసిపి కార్యకర్త....
నీ వల్లే మా వైఎస్ఆర్ కి చెడ్డ పేరు అంటూ.... పులివెందులలో జగన్ ని కొట్టటానికి వెళ్ళిన వైఎస్ఆర్ అభిమాని....
వైఎస్ కుటుంబ సన్నిహితుడు....#EndOfYCP#YSRCPRowdyism#AndhraPradesh#ChandrababuNaidupic.twitter.com/WBnOZS2Iv8— Mr Yash (@YashTDP_) July 6, 2024