YCP : బీజేపీకి వైసీపీ బిగ్ షాక్ బీజేపీకి వైసీపీ బిగ్ షాక్ ఇచ్చింది. లోక్ సభలో మోదీ సర్కార్ ప్రవేశ పెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. ఈ క్రమంలో వైసీపీ ఇండియా కూటమిలో చేరుతుందని జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరింది. By V.J Reddy 08 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ నేషనల్ New Update షేర్ చేయండి YCP Gave Big Shock To BJP : బీజేపీకి వైసీపీ బిగ్ షాక్ ఇచ్చింది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వైసీపీ వ్యతిరేకిస్తూ ప్రకటన చేసింది. ఈరోజు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును మోదీ సర్కార్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు టీడీపీ, జేడీయూ సహా ఎన్డీయే మిత్రపక్షాలు మద్దతు ప్రకటించాయి. కానీ, విపక్షాలు మాత్రం బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే, ఈ బిల్లుపై వైసీపీ లోక్ సభ పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. బిల్లును ప్రవేశపెట్టే ముందు ముస్లింల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని కేంద్రానికి సూచించారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లేవనెత్తిన అభిప్రాయాలకు తాము ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. మోదీ సర్కార్ కేంద్రంలో అధికారంలో వచ్చిన నాటి నుంచి వైసీపీ దాదాపు ప్రతి అంశంలోనూ మద్దతు ఇస్తూ వచ్చింది. అనేక బిల్లులకు అనుకూలంగా ఓటు వేసింది. తాజాగా లోక్ సభ స్పీకర్ ఎన్నికకు కూడా వైసీపీ సహకరించింది. కానీ.. ఊహించాని విధంగా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వైసీపీ వ్యతిరేకించడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. వైసీపీ ఇండియా కూటమిలో చేరుతుందమనే ప్రచారానికి బలం చేకూరింది. వక్ఫ్‌బోర్డు బిల్లును జేపీసీకి.. వక్ఫ్‌బోర్డు బిల్లును జేపీసీకి పంపింది కేంద్రం. విపక్షాల డిమాండ్‌ను కేంద్రం అంగీకరించింది. వక్ఫ్‌బోర్డు చట్ట సవరణను ఇండి కూటమి వ్యతిరేకించింది. వక్ఫ్‌బోర్డు చట్ట సవరణపై లోక్‌సభలో హాట్‌హాట్ చర్చ జరిగింది. వక్ఫ్‌బోర్డు బిల్లుకు టీడీపీ, JDU మద్దతు తెలపగా.. వైసీపీ వ్యతిరేకించింది. ఈ చట్టసవరణను టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వక్ఫ్ బోర్డు చట్టసవరణ వెనుక రాజకీయ కోణం ఉందని ఇండియా కూటమి తెలిపింది. ముస్లింల ఆస్తులు లాక్కొవడానికి ఈ బిల్లు అని ఆరోపించింది. #ycp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి