Nellore: నెల్లూరు జిల్లాలో తారాస్థాయికి చేరిన వైసీపీ వర్గ పోరు.!

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం వైసీపీ వర్గపోరు వ్యక్తిగతదాడుల వరకు దారితీసింది. వైసిపి కేడర్ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య వ్యతిరేకవర్గమైన రాకేష్ రెడ్డిపై సత్యనారాయణ రెడ్డి అనుచరులు దాడికి తెగబడ్డంతో నేరుగా వైసీపీ అధిష్టానం కల్పించుకుని సద్దుమనిగేలా చర్యలు తీసుకుంది.

New Update
Nellore: నెల్లూరు జిల్లాలో తారాస్థాయికి చేరిన వైసీపీ వర్గ పోరు.!

Nellore District : ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం వైసీపీలో ఏర్పడ్డ వర్గ పోరు కాస్త వ్యక్తిగత దాడుల వరకు దారి తీసింది. వైసిపి కేడర్ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్యకు అనుకూల వర్గం, వ్యతిరేకవర్గం అంటూ రెండు ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే వ్యతిరేకవర్గమైన రాకేష్ రెడ్డి పై సత్యనారాయణ రెడ్డి అనుచరులు దాడికి తెగబడ్డంపై నేరుగా వైసీపీ అధిష్టానం కల్పించుకుని కేసులు, మీడియాకి తెలియజేయదంటూ విషయాన్ని కాస్త సద్దు మనిగేలా చర్యలు తీసుకుంది.

Also Read: సీఎం రేవంత్ తో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ భేటీ.. కారణమిదేనా?

అసలే విషయానికొస్తే.. సులూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు వ్యతిరేకంగా ఒక వర్గం అనుకూలంగా ఒక వర్గం రెండు రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో రాకేష్ రెడ్డి సంజీవయ్య బాయ్ బాయ్ అంటూ ప్రసంగించడంతో.. ఎమ్మెల్యే అనుకూల వర్గానికి చెందిన కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి అతని అనుచరులుతో రాకేష్ రెడ్డి పై భౌతిక దాడులకు తెగబడ్డారు. సుమారు 200 మంది రాకేష్ రెడ్డి ఇంటి పై దాడి చేసి రాకేష్ రెడ్డిని కరెంటు స్తంభానికి కట్టి పిడుగుద్దుల వర్షం కురిపించారు. పోలీస్ కూడా అక్కడికి పోయే సాహసం చేయకపోవడంతో సాక్షాత్తు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి కల్పించుకుని పోలీసు వ్యవస్థను పంపించడంపై నియోజకవర్గంలో చర్చి నియాంశమైంది.

Also Read: నేడు బిగ్ బాస్ ఫైనల్స్.. విన్నర్ ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

విషయం తెలుసుకున్న వ్యతిరేక వర్గం సత్యనారాయణ రెడ్డిపై కేసు పెట్టేందుకు సమాయాతం అవుతుండగా.. నేరుగా విజయ సాయి రెడ్డి కల్పించుకుని సంజీవయ్య వ్యతిరేక వర్గానికి ఇది పార్టీ అంతర్గత విషయం గానే తీసుకోవాలని.. పోలీస్ కేసులు గాని మీడియాలో వార్తలు గాని... రాణి వద్దంటూ సద్దుమణిగెల చేశారు. కలతురు రామ్మోహన్ రెడ్డి దగ్గర నిర్వహించిన సమావేశంలో బిత్తిరి సత్తి జాగ్రత్త అంటూ సవాల్ విసిరారు. ఏది ఏమైనా అధిష్టానం కల్పించుకొని నియోజకవర్గం పరిస్థితులను చక్కదిద్దకపోతే ఈ పరిణామాలు ఎక్కడ వరకు దారితీస్తాయో అని వైసీపీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు