అనంతపురంలో రచ్చకెక్కిన వైసీపీ వర్గ పోరు.!

అనంతపురం జిల్లా ముదిగుబ్బలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేత నారాయణరెడ్డికి చెందిన ఇన్నోవా కారును తగలబెట్టారు మరో వర్గం నేతలు. దీంతో, వైసీపీ వర్గ పోరు రచ్చకెక్కింది. ఇసుక రీచ్ వాటాల పంపకంలో తేడాలు రావడంతోనే ఈ ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది.

New Update
అనంతపురంలో రచ్చకెక్కిన వైసీపీ వర్గ పోరు.!

YCP: అనంతపురం జిల్లా ముదిగుబ్బలో వైసీపీ వర్గ పోరు రచ్చకెక్కింది. ఏకంగా వాహనాలను తగలబెట్టుకుంటున్న పరిస్థితి ఏర్పిడింది. దీంతో మండలంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వర్గ పోరు తీవ్ర స్థాయికి చేరడంతో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కి తలనొప్పిగా మారింది. వారిని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక వైసీపీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు, ఈ ఘటనపై కేసు కూడా నమోదు చేయోద్దంటూ పోలీసులకు హుకుమ్ జారీ చేశారని సమాచారం. అటు వైసీపీ పెద్దలు..ఇటు పోలీసులు వారిని కంట్రోల్ చేయలేకపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయం..భయంగా బ్రతుకుతున్నారు. అసలేం జరిగిందంటే..?

Also read: తీరు మార్చుకోని టీడీపీ చింతమనేని..గొర్రెల కాపరిపై దాడి.!

ముదిగుబ్బ మండలం రాళ్ల అనంతపురం సమీపంలోని ఇసుక రీచ్ వివాదం వైసీపీలో చిచ్చురేపింది. వాటాల పంపకంలో తేడాలు రావడంతోనే వైసీపీ ఇరువర్గాలు దాడికి తెగబడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ నేత నారాయణరెడ్డి కి చెందిన ఇన్నోవా కారు పెట్రోల్ పోసి తగలబెట్టారు మరో వర్గం వైసీపీ నేతలు. ఈ ఘటనతో స్ధానిక ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే, ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్న పోలీసులు మాత్రం ఏం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని స్ధానికులు ఆగ్రహం చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేయవద్దని పోలీసులకు వైసీపీ ముఖ్య ప్రజా ప్రతినిధి ఆదేశాలు జారి చేసినట్లు తెలుస్తోంది. ఇరువర్గాల మధ్య పంచాయతీ పెట్టి సర్ది చెప్పేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని సమాచారం.

Also read: లంచం తీసుకున్నానని నిరూపిస్తే తల నరక్కుంటా..సుంకే రవిశంకర్ సంచలన వ్యాఖ్యలు.!

Advertisment
Advertisment
తాజా కథనాలు