Gudivada Amarnath: ఓటమిపై తొలిసారిగా స్పందించారు మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్. ప్రజల పక్షాన పోరాటాలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిందేనని.. కేంద్రంలో కూటమికి భిన్నమైన అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. ప్రజా తీర్పునకు అనుగుణంగా కూటమి పనిచేయాలని కోరారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకుండానే కొన్ని చోట్ల వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు.
వీటిపై కొత్త ప్రభుత్వం ఆలోచించాలని హిరావు పలికారు. రాష్ట్రంలో గొడవలు లేకుండా చూడాలని అన్నారు. ఈ దాడులు ప్రజాస్వామ్యం కాదని అన్నారు. గెలిచిన వారు బలవంతులు కాదు.. ఓడిన వారు బలహీనులు కాదని పేర్కొన్నారు. విశాఖలో పుట్టిన వ్యక్తిగా ప్రజలకు అండగా ఉంటాం అని.. వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్‌గా పని చేస్తాం అని అన్నారు. కొత్తగా అధికారం చేపడుతున్న కూటమి ప్రభుత్వానికి సమయమిస్తాం అని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. సీఎం జగన్ ఎప్పుడూ అందరిని సమానంగా చూడాలన్న భావంతో పని చేశారని వ్యాఖ్యానించారు.