Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి హైకోర్టును ఆశ్రయించారు. తనకు 4+4 భద్రత తొలగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని..భద్రతను కొనసాగించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో కోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా చేసింది. ఆలోగా పూర్తి వివరాలు తమ ముందుంచాలని ప్రభుత్వ తరపు న్యాయవాదికి ఆదేశించింది.
కాగా ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆనాడు మంత్రి హోదాలో ఉన్న అంబటి రాంబాబు ఓటమి పాలయ్యాడు. మంత్రి నుంచి మేజ్ మంత్రి కావడంతో అంబటి మంత్రికి ఉండే 4+4 భద్రతను తొలిగించింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాజీ మంత్రి అంబటి కోర్టులి పిటిషన్ వేశారు. ఇది ముమ్మాటికీ చంద్రబాబు సర్కార్ చేస్తున్న కక్ష సాధింపు చర్యలకు నిదర్శనం అని మాజీ మంత్రి అంబటి ఆరోపించారు. మరి అంబటి అనుకూలంగా కోర్టు తీర్పు ఇస్తుందా ? లేదా అనే ఉత్కంఠ వైసీపీ శ్రేణుల్లో నెలకొంది.