YS Jagan: నేడు అచ్యుతాపురానికి మాజీ సీఎం జగన్ AP: ఈరోజు అచ్యుతాపురానికి వైసీపీ అధినేత జగన్ వెళ్లనున్నారు. ఫార్మాకంపెనీలో రియాక్టర్ పేలుడు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను, గాయపడిన వారిని పరామర్శించనున్నారు. కాగా నిన్న సీఎం చంద్రబాబు అచ్యుతాపురం పేలుడు ఘటన బాధితులను పరామర్శించిన సంగతి తెలిసిందే. By V.J Reddy 23 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి YS Jagan: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న ఫార్మాకంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనాస్థలాన్ని వైసీపీ అధ్యక్షులు, మాజీ సీఎం జగన్ ఈరోజు సందర్శించనున్నారు. ఫార్మాకంపెనీలో రియాక్టర్ పేలుడు ప్రమాదంపై స్థానిక నాయకులతో మాట్లాడి జగన్ వివరాలు తెలుసుకున్నారు. ప్రమాద ప్రాంతాన్ని సందర్శించి బాధితులకు అండగా నిలవాలని ఇప్పటికే వారిని ఆదేశించారు. వాస్తవానికి జగన్ నిన్న వెళ్లాల్సి ఉండగా.. సీఎం పర్యటన నేపథ్యంలో తన పర్యటనను ఈరోజుకు వాయిదా వేసుకున్నారు. కాగా నిన్న సీఎం చంద్రబాబు అచ్యుతాపురంలో పర్యటించారు. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే ఆ కంపెనీ పై తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. జగన్ ట్విట్టర్ లో.. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు తన సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఆదుకున్న తరహాలోనే ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.1కోటి చొప్పున పరిహారం అందించాలని వైయస్.జగన్ డిమాండ్ చేశారు. గాయపడి చికిత్సపొందుతున్న వారికి ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని, వారు కోలుకునేంతవరకూ ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఫార్మా కంపెనీలో రియాక్టర్ ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ జరిపి మళ్లీ అలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. #jagan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి