YS Jagan: రేపు అచ్యుతాపురానికి మాజీ సీఎం జగన్ AP: వైసీపీ అధినేత జగన్ రేపు అచ్యుతాపురానికి వెళ్లనున్నారు. ఫార్మాకంపెనీలో రియాక్టర్ పేలుడు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను, గాయపడిన వారిని పరామర్శించనున్నారు. ఈరోజు సీఎం చంద్రబాబు అచ్యుతాపురానికి వెళ్లనున్న నేపథ్యంలో తన పర్యటనను రేపటికి వాయిదా వేసుకున్నారు జగన్ By V.J Reddy 22 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి YS Jagan: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న ఫార్మాకంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనాస్థలాన్ని వైసీపీ అధ్యక్షులు, మాజీ సీఎం జగన్ ఎల్లుండి సందర్శించనున్నారు. ఈరోజు ప్రమాదస్థలానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్తున్నారన్న వార్తల నేపథ్యంలో అధికారులకు ఇబ్బందులు కలిగించకూడదనే ఉద్దేశంతో జగన్ రేపు వెళ్లనున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. ఫార్మాకంపెనీలో రియాక్టర్ పేలుడు ప్రమాదంపై స్థానిక నాయకులతో మాట్లాడిజగన్ వివరాలు తెలుసుకున్నారు. ప్రమాద ప్రాంతాన్ని సందర్శించి బాధితులకు అండగా నిలవాలని ఇప్పటికే వారిని ఆదేశించారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు తన సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఆదుకున్న తరహాలోనే ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.1కోటి చొప్పున పరిహారం అందించాలని వైయస్.జగన్ డిమాండ్ చేశారు. గాయపడి చికిత్సపొందుతున్న వారికి ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని, వారు కోలుకునేంతవరకూ ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఫార్మా కంపెనీలో రియాక్టర్ ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ జరిపి మళ్లీ అలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న ఫార్మాకంపెనీలో రియాక్టర్ పేలుడు కారణంగా పలువురు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మరణించినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నాను. వైయస్సార్సీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఆదుకున్న తరహాలోనే ఈ… — YS Jagan Mohan Reddy (@ysjagan) August 21, 2024 #jagan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి