Jagan: నేడు గవర్నర్‌తో భేటీ కానున్న మాజీ సీఎం జగన్ AP: వైసీపీ అధినేత జగన్ ఈరోజు గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో భేటీ కానున్నారు. సాయంత్రం 5 గంటలకు రాజ్ భవన్‌కు చేరుకోనున్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి కొనసాగుతున్న అరాచక పాలన, చేస్తున్న హత్యలు, దాడులు, విధ్వంసాలను గవర్నర్ కు వివరించనున్నారు. By V.J Reddy 21 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Jagan: గవర్నర్ అబ్దుల్ నజీర్ తో మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ కానున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు సాయంత్రం 5 గం.కు రాజ్‌భవన్‌కు వెళ్లి, గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ తో భేటీ అవుతారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి కొనసాగుతున్న అరాచక పాలన, చేస్తున్న హత్యలు, దాడులు, విధ్వంసాలను వైయస్ జగన్, రాష్ట్ర గవర్నర్ కు వివరించనున్నారు. వినుకొండలో పార్టీ కార్యకర్తను అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపడం, ఆ మర్నాడే పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్ల దాడి, ఆయన వాహనాలు ధ్వంసం చేయడం, మాజీ ఎంపీ రెడ్డప్ప కారును దహనం చేయడం సహా, ఈ 45 రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న విధ్వంసాలన్నింటి సాక్ష్యాలు, వీడియోలను వైయస్ జగన్ , గవర్నర్ అబ్దుల్ నజీర్ కుఅందజేస్తారు. Also Read : కేదార్‌నాథ్‌లో విషాదం.. కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి #jagan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి