Jagan: బెంగళూరు నుంచి నేడు తాడేపల్లికి జగన్

ఈరోజు ఏపీకి రానున్నారు మాజీ సీఎం జగన్. సాయంత్రం నాలుగు గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. ఇటీవల భార్య భారతితో కలిసి జగన్ బెంగళూరుకు వెళ్లిన సంగతి తెలిసిందే. దాదాపు వారం రోజుల తరువాత జగన్ తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు.

నేడు విశాఖకు ఏపీ సీఎం జగన్‌..పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు!
New Update

Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఈరోజు ఏపీకి రానున్నారు. ఇటీవల భార్య భారతితో కలిసి బెంగళూరుకు వెళ్లిన జగన్ ఈరోజు తాడేపల్లికి వెళ్లనున్నారు. బెంగళూరు నుండి సాయంత్రం 4గంటలకు తాడేపల్లికి చేరుకోనున్నారు. కాగా ఎన్నికల తరువాత జగన్ బెంగళూరుకు వెళ్లడం ఇది రెండోసారి. మొదటిసారి బెంగళూరుకు వెళ్లిన జగన్ ఇటీవల హత్య జరగడంతో హుటాహుటిన అక్కడి నుండి అమరావతి వచ్చారు. అనంతరం బెంగళూరుకు వెళ్లారు. దాదాపు వారం రోజులపాటు బెంగళూరులోనే జగన్ ఉన్నారు.

ఇటీవల ఢిల్లీలో ధర్నా..

వైసీపీ శ్రేణులపై దాడులను నిరసిస్తూ ఢిల్లీలో ఏపీ మాజీ సీఎం జగన్ ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ధర్నాలో ఊహించని రాజకీయ పరిణామాలో చోటు చేసుకున్నాయి. జగన్ చేపట్టిన ధర్నాకు ఇండియా కూటమి నేతలు మద్దతు ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ధర్నాలో ఎస్పీ, టీఎంసీ, శివసేన, ఏఐడిఎంకే నేతలు పాల్గొన్నారు.

ఎస్పీ నేత అఖిలేష్‌ యాదవ్ (Akhilesh Yadav) ధర్నాలో కూర్చొని జగన్ కు తన మద్దతు ప్రకటించారు. ఉద్ధవ్ శివసేన ఎంపీలు ప్రియాంక చతుర్వేది (Priyanka Chaturvedi), సంజయ్‌రౌత్‌, అన్నాడీఎంకే ఎంపీ తంబి దొరై, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నదీముల్ హక్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ వాహబ్ తదితరులు సైతం జగన్ దీక్షకు హాజరై తమ మద్దతు తెలిపారు. జగన్ పోరాటానికి కూటమి మద్దతు ఉంటుందని ఆయా నేతలు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.

#jagan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe