Jagan: మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

AP: వైసీపీ ఎమ్మెల్సీలతో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీలు ప్రలోభాలకు లొంగొద్దు అని అన్నారు. మనపై కేసులు పెట్టినా బయపడొద్దని చెప్పారు. బీజేపీ, జనసేన, టీడీపీ హనీమూన్ నడుస్తోందని.. వారికి మరికొంత సమయం ఇద్దామని అన్నారు.

New Update
Jagan: మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

Jagan Meeting With YCP MLC's: వైసీపీ ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీలు ప్రలోభాలకు లొంగొద్దు అని అన్నారు. మనపై కేసులు పెట్టినా బయపడొద్దని చెప్పారు. 40 శాతం ప్రజలు మనవైపే ఉన్నారని వ్యాఖ్యానించారు. మనం చేసిన మంచి పనులు ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరి ఉన్నాయని అన్నారు. ఈవీఎంలపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని అన్నారు. బీజేపీ, జనసేన (Janasena), టీడీపీ (TDP) హనీమూన్ నడుస్తోందని చురకలు అంటించారు. వారికి మరికొంత సమయం ఇద్దామని పేర్కొన్నారు. ఆ తరువాత ప్రజల తరఫున పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. అసెంబ్లీలో మన నోరును కట్టడి చేసే అవకాశం ఉందని అన్నారు. మండలిలో గట్టిగ పోరాడుదాం అని అన్నారు.

త్వరలో ప్రజల్లోకి.. 

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూసిన జగన్ పార్టీ పునర్‌నిర్మాణంపై ఫోకస్ పెట్టారు. రోజూ ముఖ్య నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో భేటీ అవుతున్నారు. ఇవాళ వైసీపీ ఎమ్మెల్సీలతో సమావేశం అయ్యారు. 48మంది ఎమ్మెల్సీలతో జగన్ భేటీ అయ్యారు. ఎమ్మెల్సీలు చేజారి పోకుండా నిలుపుకునే వ్యూహం రచిస్తున్నారు. శాసనమండలిలో అత్యధికంగా వైసీపీ ఎమ్మెల్సీలు ఉన్నారు. ప్రభుత్వ బిల్లుల విషయంలో వైసీపీ ఎమ్మెల్సీలు కీలకం కానున్నారు. త్వరలో జగన్ ఓదార్పు యాత్ర చేయనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Advertisment
తాజా కథనాలు