YS Jagan: ఇది చంద్రబాబు కుట్రే.. జగన్ సంచలన వ్యాఖ్యలు AP: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేతపత్రాలకు కౌంటర్ ఇచ్చారు జగన్. కుట్రలో భాగంగానే చంద్రబాబు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. By V.J Reddy 26 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి YS Jagan: చంద్రబాబు సర్కార్ విడుదల చేస్తున్న శ్వేతపత్రాలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో హత్యలు, హత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రం పురోగతివైపు పోతోందా? లేదా రివర్స్ పోతుందా? అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ ఆలోచలన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. బాధితులపైనే పోలీసులు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. బడ్జెట్ ప్రవేశపెట్టలేని అధ్వాన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందని అన్నారు. పూర్తి బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టే ధైర్యం చంద్రబాబుకు లేదు అని అన్నారు. సాధారణ బడ్జెట్ పెడితే హామీలకు కేటాయింపులు చేయాల్సి ఉంటుందని.. హామీలకు నిధులు కేటాయించకపోతే ప్రజలు రోడ్డెక్కుతారని చంద్రబాబు పూర్తి బడ్జెట్ ను ప్రవేశపెట్టడం లేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పిన చంద్రబాబు .. సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలు కింది వీడియోలో చూడండి.. ఇప్పుడు అధికారం వచ్చాక అది చూపించడానికి పడరాని పాట్లు పడుతున్నారని చురకలు అంటించారు. గవర్నర్ ప్రసంగం వరకు వచ్చే సరికి రూ.10 లక్షల కోట్ల అప్పు అయ్యిందని చూపించారని అన్నారు. శ్వేత పత్రాలతో మభ్య పెట్టే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నిజంగా అది ఒకసారి గమనిస్తే... ఆర్బీఐ, కాగ్, స్టేట్ బడ్జెట్ ప్రకారం గమనిస్తే.. ఈ ఏడాది జూన్ దాకా, అదీ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్నంత దాకా చూస్తే రూ.5 లక్షల 18 వేల కోట్ల రూపాయలు మాత్రమే అని చెప్పారు. Also Read : యూరో ఎగ్జిమ్ బ్యాంకు దొంగ గ్యారెంటీలపై కదులుతున్న డొంక #ys-jagan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి