Bank Guarantees: ఇటీవల RTV వెలువరించిన కథనం నిజాలను నిగ్గు తేల్చేదిగా మారుతోంది. మేఘా ఇంజనీరింగ్ కంపెనీ, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీలకు దొంగ బ్యాంక్ గ్యారెంటీలు సబ్మిట్ చేసినట్టు RTV వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ గ్యారెంటీలు ఇచ్చిన యూరో ఎగ్జిమ్ బ్యాంకు గ్యారెంటీలను అంగీకరించిన విషయంలో ఎస్బీఐ వివరణ కావాలని కాంగ్రెస్ ఎంపీ కోరారు. ఈమేరకు ఎస్బీఐ ఛైర్మన్ కు కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఒక లేఖ రాసారు. ఈ లేఖలో యూరో ఎగ్జిమ్ బ్యాంకు దొంగ గ్యారెంటీలకు సంబంధించి 19/7/2023, 5/5/2022 తేదీలతో ఏవైనా లెటర్స్ SBI జారీ చేసిందా లేదా అనేది స్పష్టం చేయాలని కార్తీ చిదంబరం చెప్పారు. యూరో ఎగ్జిమ్ బ్యాంకు గ్యారెంటీలను SBI అంగీకరించడంపై దర్యాప్తు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా ఈ అంశంపై క్లారిఫికేషన్ ఇవ్వాలని SBI ఛైర్మన్‌ను కార్తీ చిదంబరం కోరారు.
పూర్తిగా చదవండి..Bank Guarantees: యూరో ఎగ్జిమ్ బ్యాంకు దొంగ గ్యారెంటీలపై కదులుతున్న డొంక
యూరో ఎగ్జిమ్ బ్యాంక్ దొంగ గ్యారెంటీలపై వివరణ కావాలని కోరారు ఎంపీ కార్తీ చిదంబరం. ఈ మేరకు ఎస్బీఐ ఛైర్మన్ కు ఒక లేఖ రాశారు. మేఘా కంపెనీ, మంత్రి పొంగులేటి కంపెనీలకు ఈ బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చింది. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని కార్తీ చిదంబరం లేఖలో కోరారు.
Translate this News: