/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-65-2.jpg)
YS Jagan: ప్రతిపక్ష నేత హోదా కోసం వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. పిటిషన్ విచారణార్హతపై అడ్వకేట్ జనరల్ అభ్యంతరం లేవనెత్తారు. ప్రత్యక్షంగా హాజరై వాదనలు వినిపిస్తానని ఏజీ తెలిపారు. విచారణను వాయిదా వేయాలని కోర్టును కోరారు ఏజీ. దీంతో విచారణను మంగళవారానికి వాయిదా వేసింది హైకోర్టు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 11 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు గెలవడంతో రాష్ట్ర పగ్గాలను కూలిపోయింది వైసీపీ. దీంతో జగన్ కు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.