YS Jagan: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై వైసీపీ అధినేత జగన్ ఫోకస్ పెట్టారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు పాయకరావుపేట, పెందుర్తి, నర్సీపట్నం నియోజకవర్గాల ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రేణులకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. నిన్న పాడేరు, అరకు నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులతో సమావేశం అయ్యారు.
పూర్తిగా చదవండి..YS Jagan: జగన్‌కు ఎమ్మెల్సీ ఎన్నిక టెన్షన్.. నేతలతో వరుస సమావేశాలు!
AP: ఈరోజు ఉమ్మడి విశాఖ జిల్లాలో రెండో రోజు ప్రజా ప్రతినిధులతో జగన్ సమావేశం కానున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దిశానిర్ధేశం చేయనున్నారు. కాగా తమ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును వైసీపీ ప్రకటించగా.. కూటమి ఇంకా ప్రకటించలేదు.
Translate this News: