Jagan: వైసీపీని చంద్రబాబు అణగదొక్కలేరు.. జగన్ కీలక వ్యాఖ్యలు

AP: రాష్ట్రంలో హత్యలు, దాడులు, ఇతర హింసాత్మక ఘటనలపై పార్లమెంటులో గళమెత్తాలని వైసీపీ ఎంపీలతో అన్నారు జగన్. 15 సంవత్సరాలుగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రస్థానంలో ఉందని చెప్పారు. చంద్రబాబు ఆశించినట్టుగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని అణగదొక్కలేరని అన్నారు.

New Update
Jagan: వైసీపీని చంద్రబాబు అణగదొక్కలేరు.. జగన్ కీలక వ్యాఖ్యలు

Jagan:పార్టీ ఎంపీలతో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సి వ్యూహంపై చర్చించారు. రాజ్యసభలో సంఖ్యాపరంగా కీలకంగా ఉండటంతో ఏం చేయాలన్న దానిపై దిశానిర్దేశం చేశారు. వినుకొండలో రషీద్‌ హత్యపై ఢిల్లీలో చేసే ధర్నాపైనా చర్చించారు. పార్లమెంట్‌ ఆవరణలో ధర్నా చేయాలా?.. లేదంటే బయట చేయాలన్న దానిపై చర్చలు జరిపారు. ప్రధాని, హోంమంత్రి అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నించాలని ధర్నా రోజే కలిసేలా ఏర్పాట్లు చేయాలని ఎంపీలకు సూచనలు చేశారు. ధర్నాను కలిసి వచ్చే పార్టీలను పిలవాలని ఆదేశించారు.

అణగదొక్కలేరు..

రాష్ట్రంలో హత్యలు, దాడులు, ఇతర హింసాత్మక ఘటనలపై పార్లమెంటులో గళమెత్తాలని అన్నారు. 15 సంవత్సరాలుగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు ఆశించినట్టుగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని అణగదొక్కలేరని అన్నారు. జరుగుతున్న ఘటనలు ప్రజల్లో మరింత ఆగ్రహానికి దారితీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి పాలనకు డిమండ్‌ చేయాలని అన్నారు. చంద్రబాబుకు గట్టిగా హెచ్చరికల పంపాలని.. పోరాటం చేయకపోతే దారుణాలకు అడ్డుకట్ట పడదని అన్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో నిరస..

రేపు అసెంబ్లీ సమావేశాల్లో నిరస తెలుపుతాం అని అన్నారు. మంగళవారం నాటికి ఢిల్లీకి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమైన నాయకులు వస్తారని చెప్పారు. బుధవారం నాడు నిరసన తెలుపుతాం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగిన దారుణాలన్నింటినీ కూడా దేశ ప్రజలకు చూపుతాం.. ఈ విషయంలో మనతో కలిసి వచ్చే పార్టీలను కూడా కలుపుకుపోవాలని అన్నారు. జరిగిన ఘటనలపై అందరూ గళమెత్తాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

Also Read : రెండు రోజుల పాటు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు!



Advertisment
తాజా కథనాలు