BIG BREAKING: ఇండి కూటమిలోకి వైసీపీ.. జగన్ సంచలన వ్యాఖ్యలు

ఇండి కూటమిలో వైసీపీ చేరుతుందని జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు మాజీ సీఎం జగన్. తాము ఇండి కూటమిలో చేరడం లేదని తేల్చి చెప్పారు. ఇండి కూటమిలో వైసీపీ చేరుతుందనేది తప్పుడు ప్రచారం అని ఆ వార్తలను ఖండించారు.

BIG BREAKING: ఇండి కూటమిలోకి వైసీపీ.. జగన్ సంచలన వ్యాఖ్యలు
New Update

YS Jagan: ఇండి కూటమిలో వైసీపీ చేరుతుందని జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు మాజీ సీఎం జగన్. ఢిల్లీలో చేసిన ధర్నాకు కాంగ్రెస్ రాలేదని చెప్పారు. ఇండి కూటమిలోని కొన్ని పార్టీలు తమకు మద్దతుగా వచ్చాయని చెప్పారు. తాము ఇండి కూటమిలో చేరడం లేదని స్పష్టం చేశారు. ఇండి కూటమిలో వైసీపీ చేరుతుందనేది తప్పుడు ప్రచారం అని అన్నారు.

ఏపీలో చంద్రబాబు పాలనలో జరుగుతున్న అల్లర్లకు నిరసనగా ఢిల్లీలో చేస్తున్న ధర్నాకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తప్ప మిగతా పార్టీలకు ఆహ్వానించాం అని జగన్ అన్నారు. అందులో ఇండి కూటమిలో ఉన్న కొన్ని పార్టల నేతలు తమకు మద్దతు తెలిపారని చెప్పారు. మరి ఎన్డీయేలో భాగంగా ఉన్న చంద్రబాబును కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అయిన రేవంత్ రెడ్డి కలవడంపై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మణిపూర్ లో అల్లర్లు దాడులు మీద స్పందించే కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఎందుకు రియాక్ట్ అవలేదో చెప్పాలి అని అన్నారు.

జగన్‌కు ఇండియా కూటమి నేతల మద్దతు..

ఇదిలా ఉంటే.. ఇటీవల ఢిల్లీలో జగన్ ధర్నా సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. జగన్ చేపట్టిన ధర్నాకు ఇండియా కూటమి నేతలు హాజరై మద్దతు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ధర్నాలో ఎస్పీ, టీఎంసీ, శివసేన, ఏఐడిఎంకే పార్టీల నేతలు పాల్గొన్నారు. ఎస్పీ నేత అఖిలేష్‌ యాదవ్ తో పాటు ఉద్ధవ్ శివసేన ఎంపీలు ప్రియాంక చతుర్వేది, సంజయ్‌రౌత్‌, అన్నాడీఎంకే ఎంపీ తంబి దొరై, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నదీముల్ హక్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ వాహబ్ తదితరులు జగన్ దీక్షకు హాజరై మద్దతు ప్రకటించారు. ఇండియా కూటమికి సంబంధించిన ట్విట్టర్ ఖాతాలోనూ ఈ ఫొటోలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో జగన్ ఇండియా కూటమిలో చేరడం ఖాయమన్న చర్చ  రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో మొదలైంది.


#jagan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe