/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/JAGAN-CHANDRABABU-jpg.webp)
AP: అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం జగన్ హాజరుకానున్నారు. తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో నుంచి అసెంబ్లీకి బయలుదేరారు. జగన్ తో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి రానున్నారు. ప్రతిపక్ష హోదా లేకున్నా మాజీ సీఎం కాబట్టి అసెంబ్లీలోకి వచ్చేందుకు జగన్ కారుకు అనుమతిచ్చినట్లు మంత్రి పయ్యావుల తెలిపారు. ఈరోజు ఎమ్మెల్యేగా జగన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీకి కేవలం 11 స్థానాల్లో విజయం సాధించింది. కాగా వైసీపీ కి అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానం కూడా దక్కలేదు.