YCP: శింగనమల నియోజకవర్గంలో కొనసాగుతున్న వైసీపీ అసంతృప్తి

శింగనమల నియోజకవర్గంలో వైసీపీ అసంతృప్తి పతాక స్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యే అభ్యర్థి సాంబశివారెడ్డికి వ్యతిరేకంగా అసంతృప్తి నేతలంతా ఒకచోట చేరారు. వీరాంజనేయులును మార్చకపోతే టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి 50వేలకు పైగా మెజారిటీతో గెలుస్తుందని వైసీపీ నాయకులు తేల్చిచెబుతున్నారు.

New Update
YCP: శింగనమల నియోజకవర్గంలో కొనసాగుతున్న వైసీపీ అసంతృప్తి

YCP Shinganamala Constituency:  అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులును మార్చకపోతే టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి 50వేలకు పైగా మెజారిటీతో గెలుస్తుందని వైసీపీ నాయకులు తేల్చి చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో ఉన్న అసంతృప్తి పతాక స్థాయికి చేరుకుంది. సాంబశివారెడ్డికి వ్యతిరేకంగా అసంతృప్తి నేతలు అంతా ఒకచోట చేరారు. నగరంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు.

Also Read: ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కు నిరసన సెగ.. ప్రచారాన్ని అడ్డుకున్న గ్రామస్థులు..!

మా సత్తా చూపిస్తాం..

వీరాంజనేయులుకు బీఫామ్ ఇవ్వలేదని.. వెంటనే ఆయన్ని మార్చడం అవసరమని అన్నారు. ఎమ్మెల్యే పద్మావతి భర్త సాంబశివరెడ్డి నియోజకవర్గంలో అన్ని మండలాలని తన బంధువులకు ఇచ్చి.. ఎనిమిది మంది పాలన సాగించారన్నారు. పార్టీని సర్వనాశనం చేశారని విమర్శలు చేశారు. ఇప్పుడు అలాంటి వ్యక్తి చెప్పు చేతుల్లో ఉన్న వీరాంజనేయులుకు టికెట్ ఇస్తే పార్టీ బతికే పరిస్థితి లేదన్నారు.

Also Read: సముద్ర జలాల్లో 110 మందిని రక్షించాం : భారత నావీ

త్వరలోనే పదివేల మందితో భారీ సభ నిర్వహించి మా సత్తా ఏంటో అధిష్టానానికి తెలియజేస్తామన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా ఏడ ఎనిమిది సర్వేలు జరిగాయని అన్నింటిలోనూ శ్రావణి గెలుస్తుందని రిపోర్టు వచ్చినా.. అధిష్టానం ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందని ప్రశ్నించారు. పార్టీ బ్రతకాలంటే ఇక్కడ అభ్యర్థిని మార్చే తీరాలని వారు డిమాండ్ చేశారు..

Advertisment
Advertisment
తాజా కథనాలు