ఆ రనౌట్‌ నా తప్పే.. రుతు భాయ్‌కు సారీ చెప్పిన జైస్వాల్‌

ఇండియన్ క్రికెట్ యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్‌ తన పార్ట్ నర్ రుతురాజ్‌కు సారీ చెప్పాడు. ఆస్ట్రేలియాతో వైజాగ్‌లో జరిగిన తొలి టీ20లో ఆ రనౌట్‌ నా తప్పే. పొరపాటు అంగీకరించాను. అందుకు రుతు భాయ్‌ని క్షమాపణలు కోరాను. రుతురాజ్ చాలా మంచి వ్యక్తి అన్నాడు జైస్వాల్.

New Update
ఆ రనౌట్‌ నా తప్పే.. రుతు భాయ్‌కు సారీ చెప్పిన జైస్వాల్‌

యువ సంచలనం యశస్వి జైస్వాల్‌ తొలి టీ20 మ్యాచ్ లో రుతురాజ్ ను రనౌట్ చేయడంపై స్పందించాడు. తిరువనంతపురం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈ మ్యాచ్ అనంతరం ఇంటర్వ్యూలో పాల్గొన్న జైస్వాల్ తన పార్ట్ నర్ రుతురాజ్ గైక్వాడ్ రనౌట్‌ ఘటనను గుర్తు చేసుకున్నాడు. ఈ విషయంలో తనదే తప్పు అని ఒప్పుకున్నాడు.

వైజాగ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో రనౌట్‌ నా తప్పే. నా పొరపాటు అంగీకరించాను. అందుకు నేను రుతు భాయ్‌ని క్షమాపణలు కోరాను. రుతురాజ్ చాలా మంచి వ్యక్తి అన్నాడు జైస్వాల్. ఇక రెండో టీ20లో మెరుపు ఇన్నింగ్స్‌ విషయంలో తనకు కెప్టెన్‌ సూర్యకుమార్‌, కోచ్‌ లక్ష్మణ్‌ నుంచి సంపూర్ణ మద్దతు లభించిందని జైస్వాల్‌ వివరించాడు. ‘మైదానంలో స్వేచ్ఛగా ఆడు అని మ్యాచ్‌కు ముందు సూర్య భాయ్‌, కోచ్‌ లక్ష్మణ్‌ నాకు చెప్పారు. దీంతో నేనేంటో మైదానంలో చూపించాలనుకున్నాను. నామటుకు నేను ఆటను మెరుగుపర్చుకోవాలని అనుకుంటాను. అంతకు మించి మరేదీ ఆలోచించను. నేను ఇప్పటికీ ఆట నేర్చుకుంటున్నాను. అన్ని రకాల షాట్లను మరింత సానబట్టాలని భావిస్తున్నా. ఈ దశలో మానసిక దృఢత్వం చాలా ముఖ్యం. నేను ఆ దిశగా పనిచేస్తున్నట్లు తన ప్రణాళికను వివరించాడు. ఈ మ్యాచ్‌ తనకు పూర్తిగా ప్రత్యేకమైందని పేర్కొన్నాడు. నిర్భయంగా షాట్లు కొట్టానని చెప్పాడు. అంతేకాదు.. తాను షాట్ల ఎంపిక విషయంలో కూడా చాలా స్పష్టంగా ఉన్నట్లు వెల్లడించాడు. పవర్‌ ప్లేలో సాధ్యమైనన్ని పరుగులు రాబట్టాలని ముందే అనుకున్నట్లు తెలిపాడు.

Also read :అది తెలివి తక్కువతనమే.. ఫైనల్లో భారత్ ఓటమిపై అంబటి రాయుడు

ఇక రెండో మ్యాచ్ లో యశస్వి జైస్వాల్‌ కేవలం 25 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 53 పరుగులు చేశాడు. టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో పవర్‌ప్లేలోనే అర్ధ శతకం సాధించిన మూడో భారత బ్యాటర్‌గా నిలిచాడు. గతంలో ఈ జాబితాలో రోహిత్‌(50), కేఎల్‌ రాహుల్‌ (50) ఉన్నారు. పవర్‌ ప్లేలో భారత బ్యాటర్‌ చేసిన అత్యధిక పరుగులు కూడా యశస్వి చేసిన 53 కావడం విశేషం.

Advertisment
తాజా కథనాలు