Yarlagadda Venkatrao: గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ గా యార్లగడ్డ వెంకట్రావ్

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ గా యార్లగడ్డ వెంకట్రావ్ (Yarlagadda Venkatrao) నియమితులు అయ్యారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) ఆదేశాల ప్రకారం యార్లగడ్డను గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ గా నియమిస్తున్నట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.

New Update
Yarlagadda Venkatrao: గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ గా యార్లగడ్డ వెంకట్రావ్

Yarlagadda as TDP In Charge of Gannavaram Constituency in Andhra Pradesh: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ గా యార్లగడ్డ వెంకట్రావ్ (Yarlagadda Venkatrao) నియమితులు అయ్యారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) ఆదేశాల ప్రకారం యార్లగడ్డను గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ గా నియమిస్తున్నట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.

పెద్ద ఎత్తన టీడీపీలో చేరిన వైసీపీ నేతలు:

గన్నవరం నియోజకవర్గంలో బుధవారం యార్లగడ్డ ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో వైసీపీ నేతలు, శ్రేణులు టీడీపీలో చేరారు. అనంతరం గన్నవరం నియోజకవర్గ ఇన్ చార్జ్ గా యార్లగడ్డ వెంకట్రావును నియమిస్తున్నట్లు లోకేష్ ప్రకటించారు. ఈ సందర్భగా లోకేష్ మాట్లాడతూ.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో యార్లగడ్డను గెలిపించి పసుపు జెండా ఎగుర వేయాలని పిలుపునిచ్చారు. అయితే గన్నవరంలో లోకేష్ ప్రసంగిస్తుండగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో అక్కడున్నవారంతా జై లోకేష్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. టీడీపీ శ్రేణులు సెల్ ఫోన్ టార్చ్ లు వేశారు.

పిల్ల సైకోవంశీని రాజకీయాల నుంచి శాశ్వతంగా బహిష్కరించాలి:

రాష్ట్రంలో విద్యుత్ సరఫరా కూడా సరిగా చేయలేని ప్రిజనరీకి, ముందు చూపుతో విద్యుత్ సమస్యలు పరిష్కరించి విజనరీకి ఇదే తేడా అంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. గన్నవరంలో టీడీపీ కార్యకర్తను కాపాడుకునే బాధ్యత తీసుకుంటానన్నారు. తన గెలుపు కోసం కష్టపడిన తెలుగుదేశం శ్రేణులపై తప్పుడు కేసులు పెట్టి మరీ వేధిస్తున్న పిల్ల సైకో వంశీ అంటూ మండిపడ్డారు. పిల్ల సైకోవంశీని రాజకీయాల నుంచి శాశ్వతంగా బహిష్కరించేందుకు అంతా కలిసికట్టుగా పని చేయాలన్నారు లోకేష్.

పార్టీ మారే ముందు కూడా పట్టిసీమ లేకుంటే గన్నవరంలో బాత్రూమ్ కడిగేందుకు కూడా నీళ్లు ఉండేవి కాదంటూ వంశీ ఎంతో నటించాడని అన్నారు లోకేష్. కనీసం పేరు కూడా సరిగా తెలియని గన్నవరం పిల్ల సైకోకి ఓసారి ఎంపీగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా తెలుగుదేశం బీఫామ్ ఇచ్చిందన్నారు. మంగళగిరిలో ఓటమే తనలో కసి పెంచిందన్నారు. తరచూ ఓడిపోతున్న మంగళగిరి ఇప్పుడు తెలుగుదేశం కంచుకోటగా మారిందన్నారు. ఇక్కడున్న పిల్ల సైకోని, పక్క నియోజవర్గo గుడివాడలో సన్న బియ్యం సన్నాసిని ఓడించాలంటూ వ్యాఖ్యలు చేశారు.

గన్నవరం ఇన్ చార్జ్ గా చనిపోయే వరకూ బచ్చుల అర్జనుడు అంకిత భావంతో కృషి చేశారన్నారు. శాసనమండలిలో తనతో పాటు బచ్చుల అర్జునుడు, మంతెన సత్యనారాయణ రాజు మూడు రాజధానుల బిల్లు అడ్డుకోవడంలో ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. బచ్చుల అర్జనుడు కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉండి వారిని రాజకీయంగా పైకి తీసుకొస్తుందని భరోసా ఇచ్చారు నారా లోకేష్.

Advertisment
Advertisment
తాజా కథనాలు