Yarlagadda Venkata Rao : ఏది ఏమైనా గన్నవరం నుంచే నా పోటీ: యార్లగడ్డ!
ఏపీ రాజకీయాల్లో వేడివేడిగా ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది గన్నవరం నియోజకవర్గమే. ఇక నుంచి గన్నవరం నియోజకవర్గంలోనే కొనసాగుతాను అంటున్నారు వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు.
ఏపీ రాజకీయాల్లో వేడివేడిగా ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది గన్నవరం నియోజకవర్గమే. ఇక నుంచి గన్నవరం నియోజకవర్గంలోనే కొనసాగుతాను అంటున్నారు వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు.
గన్నవరం రాజకీయాలు హీటెక్కుతున్నాయి. యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతుండగా.. ఇవాళ ఆ విషయం గురించి ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. గన్నవరం నియోజకవర్గంలోని దాదాపు 2,000మంది కార్యకర్తలతో ఆయన భేటీ అవుతున్నారు. ఈ మీటింగ్ తర్వాత తన భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తారన్న ఉహాగానాలు వినిపిస్తున్నాయి.
గన్నవరంలో వైసీపీకి షాక్ తగిలేలా కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న యార్లగడ్డ వెంకట్రావు.. టీడీపీలో జంప్ అయ్యేందుకు రెడీ ఐనట్టు తెలుస్తోంది. ఈ నెల 19న టీడీపీ యువ నేత నారా లోకేశ్ పాదయాత్ర ఎన్టీఆర్ జిల్లాలోకి ఎంట్రీ ఇవ్వనుండడంతో ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీలోకి యార్లగడ్డ వెళ్లనున్నారన్న ప్రచారం జరుగుతోంది. వల్లభనేని వంశీకే వైసీపీ నుంచి గన్నవరం టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండడంతోనే యార్లగడ్డ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు.
గన్నవరం రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. 2019 ఎన్నికల్లో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గెలుపుపై వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిగ్గింగ్ చేసో.. దొంగ ఓట్లతోనే కారణాలు ఏమైనా ఎమ్మెల్యేగా వంశీ గెలిచారంటూ ఆరోపణలు చేశారు. అమెరికాలో ఉన్న తనను గన్నవరం తీసుకొచ్చిన జగన్ రోడ్డు మీద పడేస్తారని అనుకోవడం లేదని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి సీటు వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.