Y.S Sharmila Son Marriage: షర్మిల కుమారుడు రాజారెడ్డి లవ్ మ్యారేజ్

వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల కుమారుడు రాజారెడ్డి ప్రియ అట్లూరితో లవ్ మ్యారేజ్ ఫిక్స్ అంటూ వార్త హల్ చల్ చేస్తోంది. వీరి వివాహానికి 2 కుటుంబాలు ఆమోదం చెప్పినట్లు సమాచారం. తాజాగా ప్రియకు షర్మిల తల్లి విజయమ్మ చీర పెట్టిన ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

New Update
Y.S Sharmila Son Marriage: షర్మిల కుమారుడు రాజారెడ్డి లవ్ మ్యారేజ్

Y.S Sharmila Son Marriage: వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆమె కొడుకు రాజారెడ్డి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని షర్మిల బహిరంగంగా చెప్పకపోయినా సోషల్‌ మీడియలో చర్చ జరుగుతూనే ఉంది. రాజారెడ్డి చేసుకోబోయో అమ్మాయితో కలిసి ఉన్న ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇద్దరూ కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారని, పెళ్లికి ఇరు కుటుంబాల వారు ఒప్పుకున్నారని టాక్‌ నడుస్తోంది.

publive-image

తాజాగా ప్రియకు షర్మిల తల్లి విజయమ్మ చీర పెట్టిన ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. రాజారెడ్డి చేసుకునే అమ్మాయిపేరు ప్రియా అట్లూరి. ఈమె కూడా అమెరికాలోని పేరున్న విశ్వవిద్యాలయంలో మాస్టర్స్‌ పూర్తి చేసింది. ప్రస్తుతం అక్కడ ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ప్రియా పేరున్న కుటుంబానికి చెందినది. ఈమె తాత అట్లూరి ప్రసాద్‌ రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరొందిన ఛట్నీస్‌ రెస్టారెంట్‌ నిర్వాహకుడు. రెండు కూడా ఉన్నత కుటుంబాలే కావడంతో రాజారెడ్డి, ప్రియ పెళ్లికి గ్రీన సిగ్నల్‌ ఇచ్చారు. కాగా, రాజారెడ్డి తండ్రి బ్రాహ్మణ, తల్లి రెడ్డి, విరిద్దరిది కూడా ప్రేమ వివాహమే. షర్మిలను చేసుకున్న తర్వాత అనిల్‌ క్రైస్తవ మతంలోకి మారిపోయారు. ప్రస్తుతం ఆయన మతబోధకుడిగా కొనసాగుతున్నారు. ప్రియ కుటుంబానిది కమ్మ సామాజిక వర్గం. ఆ మధ్య జగన్ పెద్ద కూతురును రాజారెడ్డికి ఇస్తున్నారని ప్రచారం జరిగింది. తర్వాత ఏమైందో తెలియదుగాని అది ప్రచారానికే పరిమితం అయిపోయింది. ఇప్పుడు జగన, షర్మిల మధ్య మాటలు లేవ్‌. మరి ఈ విషయం అతడికి తెలిసిందా? పెళ్లికి జగన్ హాజరవుతాడా? లేదా అనేది చూడలి.

publive-image

Advertisment
Advertisment
తాజా కథనాలు