ఎలన్‌మస్క్‌కు తలనొప్పిగా మారిన కొత్త లోగో, లోగోను తొలగించిన అధికారులు సోషల్‌మీడియాలో దిగ్గజమైనటువంటి ఎక్స్ ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్‌కు శాన్ ఫ్రాన్సిస్కో అధికారులు షాకిచ్చారు. నగరంలో ఎక్స్ ప్రధాన కార్యాలయంపై కొత్తగా ఏర్పాటు చేసిన సంస్థ లోగో ‘X’ ను అక్కడి అధికారులు తొలగించారు. స్థానికుల ఫిర్యాదుతో నగర యంత్రాంగం ఈ ఎక్స్ లోగోను తొలగించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. దీంతో మనోడికి కొత్త చిక్కు వచ్చి పడింది. By Shareef Pasha 01 Aug 2023 in ఇంటర్నేషనల్ Scrolling New Update షేర్ చేయండి ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయినటువంటి ట్విట్టర్‌ను సూపర్ యాప్‌గా మార్చే క్రమంలో దాని పేరును ఆ సంస్థ అధినేత అయినటువంటి ఎలన్ మస్క్ ‘X’ గా మార్చాడు. దీంతో ట్విట్టర్ పాలపిట్ట స్థానంలోకి ‘X’ లోగో వచ్చి చేరింది. అయితే కొత్తగా వచ్చిన ఇదే లోగో ఎలన్ మస్క్‌కు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. లోగో మార్చినప్పటి నుండి మనోడికి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా అవేవి పట్టించుకోకుండా లోగోను మార్చాడు. ఇప్పుడు మళ్లీ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. లోగోపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తక్షణమే దాన్ని మార్చాలంటూ ఫిర్యాదులు అందడంతో చేసేదేమి లేక లోగోను తొలగించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు లోగో తొలగింపు The "𝕏" logo on X's (Twitter's) HQ building has been removed from on top of the building.pic.twitter.com/jIQar7xZji https://t.co/64OpfdpaEj — Information Worldwide (@InfoEarthwide) August 1, 2023 లోగో మార్చిన తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోలోని సంస్థ ప్రధాన కార్యాలయంపై కొత్త లోగో అయినటువంటి ‘X’ లోగోను ఏర్పాటు చేశారు. అయితే ప్రధాన కార్యాలయంపై ఆ లోగో ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. ఎక్స్ లోగో కారణంగా అక్కడి స్థానికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని నగర వాసులంతా అక్కడి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎక్స్ లోగో డిస్‌ప్లేలో అమర్చిన ప్రకాశవంతమైన లైట్ల కారణంగా రాత్రుళ్లు ఆ కాంతి నేరుగా తమ ఇళ్ల లోపలికి పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని కారణంగా రాత్రుళ్లు తమ నిద్రకు తీవ్ర ఆటంకం కలుగుతోందని భారీ సంఖ్యలో నగర యంత్రాంగానికి ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా లోగో ఏర్పాటు దీంతో వారి ఫిర్యాదు మేరకు ఆ లోగోను తొలగించినట్లు శాన్ ఫ్రాన్సిస్కో భవనాల తనిఖీ విభాగం అధికారి పాట్రిక్ హన్నన్ తెలిపారు. ‘X’ లోగోపై తమకు 24 మంది ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. స్థానికుల ఫిర్యాదుతో లోగో ఏర్పాటును సమీక్షించి, నిబంధనలకు విరుద్ధంగా దాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు నిర్ధారించినట్లు అక్కడి అధికారి వెల్లడించారు. దీంతో లోగోను తొలగించాలని ఆదేశాలు కూడా జారీ చేసినట్లు పేర్కొన్నారు. దీంతో పెద్ద సమస్యే వచ్చి పడిందంటూ నెటిజన్లు సోషల్‌మీడియా వేదికగా ఫన్నీ కామెంట్లతో మనోడిని ఓదార్చే పనిలో పడ్డారు. #international-news #elan-musk #twitter-new-logo-issue మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి