బ్లూ టిక్ స్పెషాలిటీ!
ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించిన వారికి ట్విటర్ వెరిఫికేషన్ బ్యాడ్జ్ కింద బ్లూ టిక్‌లను ఇచ్చేంది. ఇది పూర్తి ఉచితంగా అందించేది. దీనితో సెలబ్రిటీలు, ఇన్ప్లూయెన్సర్స్లు, పొలిటీషియన్ల అకౌంట్లకు బ్లూటిక్ మార్కులు ఉండేవి. కనుక యూజర్లు నిజమైన అకౌంట్లను ఫాలో కావడానికి వీలయ్యేది. కానీ 2022లో ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. తరువాత ఫ్రీగా బ్లూ టిక్స్ ఇవ్వడం మానేశారు. బ్లూ టిక్ కావాలని అనుకునేవాళ్లు నెలకు స్టార్టింగ్ ఫీజుగా 8 డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
దీనితో పలువురు సెలబ్రిటీల, హై-ప్రొఫైల్ అకౌంట్లకు ఉన్న బ్లూటిక్‌లు పోయాయి. ఇదే అవకాశంగా చాలా ఫేక్ ఎక్స్ అకౌంట్లు పుట్టుకొచ్చాయి. ఈ ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసిన వాళ్లు డబ్బులు చెల్లించి బ్లూ టిక్ కొనుకున్నారు. దీనితో అసలు, నకిలీ ఖాతాల మధ్య తేడా గుర్తించలేక యూజర్లు చాలా తికమకపడడం మొదలైంది.
ఫ్రీగా బ్లూటిక్!
పరిస్థితి చేయి దాటిపోతుండడం వల్ల ఎలాన్ మస్క్ యూ-టర్న్ తీసుకున్నారు. ఇకపై 2500 మందికంటే ఎక్కువ ఫాలోవర్లు ఉన్న యూజర్లకు పూర్తి ఉచితంగా బ్లూ టిక్ అందిస్తామని స్పష్టం చేశారు. పైగా వాళ్లకు ప్రీమియం ఫీచర్లను కూడా ఫ్రీగా అందిస్తామని తెలిపారు. 5000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న అకౌంట్లకు పూర్తి ఉచితంగా ప్రీమియం ప్లస్ ఫెసిలిటీస్ కల్పిస్తామని గతవారంలో ఆయన పేర్కొన్నారు.
దీనితో బుధవారం అర్ధరాత్రి నుంచి పలువురు ఎక్స్ యూజర్ల అకౌంట్లకు బ్లూటిక్‌లను పునరుద్ధరించడం జరిగింది. దీనిపై పలువురు యూజర్లు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్లూ టిక్ మార్క్ కోసం డబ్బులు కట్టినవాళ్లు మాత్రం ఫ్రస్టేషన్‌కు గురవుతున్నారు. అయితే ఈ తాజా పరిణామం గురించి ఎలాన్ మస్క్ గానీ, అతని అధికారిక ప్రతినిధులు కానీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.