అబ్బాయిలు సాధించలేనిది అమ్మాయిలు సాధించారు. విమెన్స్ ప్రిమియర్ లీగ్ విజేతగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ టీమ్ ఆవిర్భవించింది. ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 8 వికెట్ల తేడాతో ఆర్‌సీబీ ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 18.3 ఓవర్లలో 113పరుగులకే ఆలౌట్ అయ్యింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు మరో 3 బంతులు మిగిలి ఉండగానే విక్టరీ కొట్టింది. ఇది బెంగళూరుకు తొలి WPL టైటిల్.
గతేడాది నుంచే WPL స్టార్ట్ అయ్యింది. 2023లో ముంబై విజేతగా నిలిచింది. బెంగళూరు లాస్ట్‌ప్లేస్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఏడాది మాత్రం బెంగళూరు సత్తా చాటింది. ఏకంగా ట్రోఫిని ఎగరేసుకుపోయింది.
పురుషుల ఐపీఎల్‌లో అబ్బాయిలు ఇప్పటివరకు కప్ కొట్టలేకపోయారు. 2008లో ఐపీఎల్ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. 16 సీజన్లగా బెంగళూరుకు కప్ లేదు. అయితే మహిళలు మాత్రం రెండో సీజన్‌లో ట్రోఫిని గెలుచుకోవడం విశేషం.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీని ఆర్‌సీబీ మహిళా బౌలర్లు కట్టడి చేశారు. ఢిల్లీ బ్యాటర్లను భారీ షాట్లకు పోనివ్వకుండా అద్భుతంగా బౌలింగ్ చేశారు. నిజానికి స్టార్టింగ్‌లో ఢిల్లీ బ్యాటర్లు బాగా ఆడారు. ఓదశలో ఢిల్లీ భారీ స్కోరు చేసేలా కనిపించింది కూడా. అయితే 64/0 నుంచి 113కు ఆలౌట్ అయ్యిందంటే అది ఆర్‌సీబీ బౌలర్ల గొప్పతనమే.
ఓపెనర్లు మెగ్ లానింగ్ (23), షెఫాలి వర్మ (44) కాకుండా మిగిలిన అందరూ విఫలమయ్యారు. వికెట్ నష్టపోకుండా పవర్ ప్లేలో 61 పరుగులు చేసిన ఢిల్లీ తర్వాత పేకమేడలా వికెట్లను కోల్పోయింది. ఆర్‌సీబీ బౌలర్ సోఫీ మోలినక్స్ దెబ్బకు ఢిల్లీ ఢమాల్ అయ్యింది. 8వ ఓవర్‌లో ఢిల్లీ పతనాన్ని సోఫీ శాసించింది. ఒక ఓవర్‌లోనే ఏకంగా వరుసగా 3 వికెట్లు తీసి ఢిల్లీని కోలుకోలేని దెబ్బ కొట్టింది.
ఆర్సీబీ బౌలర్లలో మోలినెక్స్, శ్రేయాంక పాటిల్‌లు 3 వికెట్ల చొప్పున పడగొట్టారు. ఆశ శోభన 2 వికెట్లు తీసింది.
ఇక తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ ఆడుతూ పాడుతూ టార్గెట్‌ను ఫినిష్ చేసింది. కెప్టెన్ మంథానా, సోఫి తొలి వికెట్‌కు 49 పరుగులు జోడించారు. ఈ ఇద్దరు ఔటైన తర్వాత పెర్రీ, రిచా ఘోష్ విజయలాంఛనాన్ని పూర్తి చేశారు.
ఆర్‌సీబీ బ్యాటర్లలో పెర్రీ 35 పరుగులతో నాటౌట్‌గా నిలవడమే కాకుండా టాప్ స్కోరర్‌గా నిలిచింది.