Android 15 : వైరస్ కు చెక్ పెడుతున్న ఆండ్రాయిడ్ 15లోని ఫీచర్! ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్‌ను గూగుల్ త్వరలో పరిచయం చేయనుంది. ఇప్పుడు దీని సెక్యూరిటీ ఫీచర్ల వివరాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. అవేంటో చూసేద్దాం రండి! By Durga Rao 03 May 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Android 15 Feature : గూగుల్ ఐ/వో 2024 ఈవెంట్ మే నెలలో జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లోనే ఆండ్రాయిడ్ 15(Android 15) ను గూగుల్(Google) పరిచయం చేయనుంది. దీనికి ముందు గూగుల్ తీసుకురానున్న ఈ ఆపరేటింగ్ సిస్టంకు సంబంధించి పెద్ద సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆండ్రాయిడ్ 15లో అద్భుతమైన సెక్యూరిటీ ఫీచర్లు(Security Features) ఉండనున్నాయని తెలుస్తోంది. ఈ ఫీచర్ ఫేక్ యాప్‌లను డౌన్‌లోడ్ చేయడాన్ని నిరోధించడమే కాకుండా ఫోన్‌లో ఉన్న ఫేక్ యాప్‌లను బ్లాక్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 అందిస్తున్న ఈ సెక్యూరిటీ ఫీచర్‌కు సంబంధించి, ఆండ్రాయిడ్ అథారిటీలో మొదట రిపోర్ట్ చేశారు. ఈ ఫీచర్ ఎర్లీ బీటా వెర్షన్‌లో కనిపించిందని తెలుస్తోంది. గూగుల్ తన ఆపరేటింగ్ సిస్టమ్‌లోని యాప్ స్టోర్‌లో ఫేక్ యాప్స్‌ను లిమిట్ చేసే విధంగా సిస్టమ్‌ను డెవలప్ చేస్తుది. ఆండ్రాయిడ్ ఈ ఫీచర్‌కు క్వారంటైన్ అని పేరు పెట్టారు. ఇది మీ ఫోన్‌ను వైరస్ దాడుల నుంచి రక్షిస్తుంది. Also Read : పెట్రోల్ తెగ వాడేస్తున్నారు.. డిమాండ్ తగ్గిన డీజిల్ ఇటీవలే ఆండ్రాయిడ్ 15 బీటా వెర్షన్ ఆండ్రాయిడ్ 15 కోసం యూజర్లు చాలా నెలలుగా వెయిట్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్న వినియోగదారులు ఆండ్రాయిడ్ 15 ద్వారా తమ ఫోన్‌లకు ఏ కొత్త ఫీచర్‌లు వస్తాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఇటీవల ఆండ్రాయిడ్ 15 ఫస్ట్ పబ్లిక్ బీటా వెర్షన్‌ను గూగుల్ విడుదల చేసింది. ఆండ్రాయిడ్ 15 బీటా 1 వెర్షన్ ప్రస్తుతం గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్(Google Pixel Smartphone) వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ 15 బీటా వెర్షన్‌ను పిక్సెల్ 6 సిరీస్, పిక్సెల్ 7 సిరీస్, పిక్సెల్ టాబ్లెట్, పిక్సెల్ ఫోల్డ్, పిక్సెల్ 8 సిరీస్‌లలో ఇన్‌స్టాల్ చేయవచ్చు. వినియోగదారులు ఆండ్రాయిడ్ 15 ద్వారా మరొక ప్రత్యేక ఫీచర్‌ను కూడా పొందనున్నారని వార్తలు వస్తున్నారు. దీని ద్వారా ఫోన్‌లోని యాప్స్ విండో స్టైల్‌లో ఓపెన్ అవ్వవు. కానీ ఈ యాప్స్ అన్నీ ఫుల్ స్క్రీన్ మోడ్‌లో ఓపెన్ అవుతుంది. అంటే ఫోన్‌లో ఏదైనా యాప్‌ను ఉపయోగిస్తున్నప్పుడు కింద లేదా పైన కనిపించే బ్లాక్ కలర్ బార్ బాక్స్ ఇకపై కనిపించదు. ఈ ఫీచర్‌తో వినియోగదారుల డిస్‌ప్లే ఎక్స్‌పీరియన్స్ చాలా కొత్తగా, అద్భుతంగా మారుతుంది. #google #best-smartphones #android-15 #security-features మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి