Guinness World Record: అగ్గిపెట్టె సైజులో వాషింగ్ మెషీన్.. ఆంధ్ర కుర్రాడు గిన్నిస్‌ రికార్డు!

ఏపీలోని తుని నగరానికి చెందిన 17 ఏళ్ల కుర్రాడు శ్రీ సాయి తిరుమలనిది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. 37మి.మీx41మి.మీx43 మి.మీ కొలతలతో ప్రపంచంలోనే అతిచిన్న వాషింగ్ మెషీన్ ను రూపొందించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాడు. నెట్టింట వీడియో వైరల్ అవుతోంది.

New Update
Guinness World Record: అగ్గిపెట్టె సైజులో వాషింగ్ మెషీన్.. ఆంధ్ర కుర్రాడు గిన్నిస్‌ రికార్డు!

World's Smallest Washing Machine: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి  (AP)చెందిన 17 ఏళ్ల కుర్రాడు దేశం గర్వపడేలా చేశాడు. ప్రపంచంలోనే అతి చిన్న వాషింగ్ మెషీన్‌ను రూపొందించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (Guinness World Record) అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీ ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేయగా ఇది వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా బుల్లి మిషన్ ను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. దాని పనితీరును చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఆ కుర్రాడి ప్రతిభను తెగ పొగిడేస్తున్నారు.

అగ్గిపెట్టె అంత సైజులోనే..
ఇక అసలు విషయానికొస్తే.. తుని నగరానికి చెందిన శ్రీ సాయి తిరుమలనిది (Sai TirumalaNeedi) అనే 17 ఏళ్ల కుర్రాడు ఈ ఘనతను సాధించాడు. మిస్టర్ సాయి తన అద్భుతమైన మేధస్సుతో 1.45x1.61x1.69 అంగుళాలు మాత్రమే ఉండే వాషింగ్ మెషీన్‌ను రూపొందించాడు. అంచనా వేయడానికి ఇది ఒక అగ్గిపెట్టె అంత సైజులోనే ఉంది. అంతేకాదు ప్రపంచంలోని అతి చిన్న యంత్రంగా గుర్తించి బడిన ఈ మిషన్ అద్భుతంగా పనిచేయడం విశేషం.

ఇది కూడా చదవండి: Telangana: తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు!

అయితే శ్రీ సాయి చిన్న చిన్న భాగాలను ఉపయోగించి వాషింగ్ మెషీన్‌ను ఇన్‌స్టాల్ చేశాడు. దీని పనితీరు సాధారణ మోటారుతో ప్రారంభమవుతుంది. శ్రీ సాయి పరికరాన్ని పూర్తి చేసిన తర్వాత దానిని పరీక్షకు పెట్టాడు. యంత్రంలో నీరు పోయడం, గుడ్డ ముక్క వేయడం, డిటర్జెంట్‌ను పోయడం చూడవచ్చు. ఈ యంత్రం ఎలా పనిచేస్తుందో చూపించిన తర్వాత దాని నుంచి ఉతికిన గుడ్డ ముక్కను బయటకు తీసి చూపించాడు. ఇక ఈ వీడియోను షేర్ చేస్తూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఇలా రాసింది.. 'సాయి తిరుమలనీడి ద్వారా అతిచిన్న వాషింగ్ మెషిన్ 37మి. మీx41మి. మీx43 మి.మీ కొలతలతో సాయి ఈ యంత్రాన్ని రూపొందించాడు' అంటూ పొగిడేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు