ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ అందించిన సమాచారం ఆధారంగా, ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల ర్యాంకింగ్‌ను హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్ నివేదికలో ప్రచురించింది. సింగపూర్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఈ పాస్‌పోర్ట్‌తో వీసా లేకుండా 195 దేశాలకు ప్రయాణించవచ్చు.
2వ స్థానం: ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ (192 దేశాలకు వీసా రహిత ప్రయాణం)
3వ స్థానం: ఆస్ట్రియా, ఫిన్‌లాండ్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్వీడన్ (191 దేశాలకు వీసా రహిత ప్రయాణం)
4వ స్థానం: బెల్జియం, డెన్మార్క్, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్, UK, (190 దేశాలకు వీసా-రహిత ప్రయాణం)
5వ స్థానం: ఆస్ట్రేలియా, పోర్చుగల్ (189 దేశాలకు వీసా-రహిత ప్రయాణం)
6వ స్థానం: గ్రీస్, పోలాండ్ (188 దేశాలకు వీసా-రహిత ప్రయాణం)
7వ స్థానం: కెనడా, హంగేరీ, మాల్టా (187 దేశాలకు వీసా రహిత ప్రయాణం) USA (వీసా లేకుండా 186 దేశాలకు ప్రయాణించవచ్చు
8వ స్థానం: ఎస్టోనియా, లిథువేనియా, UAE (వీసా లేకుండా 185 దేశాలకు వెళ్లవచ్చు)
9వ స్థానం: ఐస్‌లాండ్, లాట్వియా, స్లోవేకియా, స్లోవేనియా (వీసా లేకుండా 184 దేశాలకు వెళ్లవచ్చు)
ఈ జాబితాలో భారతీయ పాస్‌పోర్ట్ 82వ స్థానంలో ఉంది. భారతీయ పాస్‌పోర్ట్‌తో, మీరు వీసా లేకుండా ఇండోనేషియా, మలేషియా థాయ్‌లాండ్‌తో సహా 58 దేశాలకు ప్రయాణించవచ్చు.మన పొరుగు దేశం పాకిస్తాన్ ఈ జాబితాలో 100వ స్థానంలో ఉంది. ఈ దేశం పాస్‌పోర్ట్‌తో, మీరు వీసా లేకుండా 33 దేశాలకు ప్రయాణించవచ్చు. ఈ జాబితాలో చివరిది ఆఫ్ఘనిస్థాన్. ఈ దేశ పాస్‌పోర్ట్ 26 దేశాలకు వీసా రహిత ప్రయాణాన్ని అనుమతిస్తుంది.