అత్యంత ఖరీదైన విడాకుల విలువ రూ.6 లక్షల కోట్లు, ఆ జంట ఎవరు?

పెళ్లంటే నూరేళ్ల జీవితం. ఇద్దరు ఒక్కటై కలిసిమెలసి అన్యోన్యంగా జీవించడమే వివాహానికి నిజమైన అర్థం. కొంతమంది తమ స్థోమతను బట్టి ఘనంగా చేసుకుంటే..ఇంకొంతమంది తమ తాహతును బట్టి చేసుకుంటారు. అయితే కొంతమంది దంపతులు పెళ్లిళ్ల విషయంలోనే కాదు..విడాకులు కూడా ఖరీదైన వ్యవహారంగా మారింది. విడాకులు సమయంలో ఇచ్చే భరణాల గురించి ప్రపంచం మొత్తం మాట్లాడే విధంగా. అయితే ప్రపంచంలో అత్యంత ఖరీదైన విడాకులు ఏ జంట తీసుకుందో తెలుసా?

New Update
అత్యంత ఖరీదైన విడాకుల విలువ రూ.6 లక్షల కోట్లు, ఆ జంట ఎవరు?

Worlds Most Expensive Divorce: మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు, బిల్‌మిలిందాగేట్స్‌ ఫాండేషన్‌ ఛైర్మన్‌ బిల్‌గేట్స్‌ (Bill Gates)..ఆయన సతీమణి మిలిందా (Melinda) మే 4, 2021న తీసుకున్న విడాకుల నిర్ణయం యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. 27 సంవత్సరాల తమ వైవాహిక బంధానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నారు. ఈ వార్త ప్రతి ఒక్కరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ క్రమంలో వారు విడాకులు తీసుకున్నారు. అయితే భరణం కింద మిలిందాకు బిల్ గేట్స్ ఎంత భరణం ఇచ్చారో తెలుసుకునేందుకు చాలామంది ప్రయత్నించారు. ఖచ్చితమైన భరణం ఎంత ఇచ్చారో మీడియాలో బహిర్గతం కానప్పటికీ, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన మాజీ భార్య మెలిండా గేట్స్‌కు భారీ మొత్తంలో చెల్లించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

బిల్ గేట్స్ మెలిండా గేట్స్‌కు 73 బిలియన్ డాలర్లు అంటే రూ. 6 లక్షల కోట్లు అందించారు. దీంతో ప్రపంచంలోని అత్యంత విడాకులు భరణం(Worlds Most Expensive Divorce) తీసుకున్న మహిళల్లో మిలిందా ఒకరిగా నిలిచారు.ఫోర్బ్స్ (Forbes) ప్రకారం బిల్ గేట్స్ నికర విలువ ప్రస్తుతం 119.4 బిలియన్ డాలర్లుగా ఉంది.

27 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలకాలని నిర్ణయం తీసుకున్నట్లు బిల్‌ గేట్స్ దంపతులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. బిల్‌గేట్స్, మిలిందా దంపతులు..మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడిగానే కాకుండా..పలు ధార్మిక కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందారు. ఎన్నో సమాలోచనలు, ఎంతో మథనం తర్వాత మా వైవాహిక బంధానికి ముగింపు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చామని తెలిపారు. గత 27 ఏళ్లలో మేము ముగ్గురు అత్యద్భుతమైన పిల్లలను తీర్చిదిద్దామని ప్రకటించారు. ఇక దంపతులుగా ఉండలేమన్న వారి ప్రకటన యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ ఫౌండేషన్ ద్వారా తాము కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు.

ఇక బిల్ గేట్స్, మిలిందా దంపతులే కాదు దుబాయ్ రాజు షేక్ మహ్మద్ బిన్ రిషీద్ అల్ మక్తూ, తన మాజీ భార్య జోర్డాన్ రాకుమారి హయా బింత్ అల్ హుస్సేన్ కు రూ. 5,555కోట్లు భరణంగా చెల్లించారు. దీన్ని బ్రిటిష్ చరిత్రలో అత్యంత ఖరీదైనది. అటు ఆస్ట్రేలియన్, అమెరిక్ వ్యాపారవేత్త మొఘల్ కూడా 1999లో విడాకులు తీసుకుననారు. ఆ సమయంలో అన్నామన్ కు 1.7బిలియన్ డాలర్లు భరణం రూపంలో అందజేశారు. అమెరిన్ నటుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత గిబ్సన్, రాబిన్ మారే దంపతులు కూడా ఖరీదైన విడాకులు తీసుకున్నారు. అప్పట్లో 850 మిలియన్ డాలర్లుగా అందించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు