New Update
Dr BR Ambedkar Statue: ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టి నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుఉతున్నాయి. ఈ ఆవిష్కరణ మహోత్సవాలకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చే అవకాశాలు ఉన్న కారణంతో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
జనవరి 19న ఏపి సిఎం చేతుల మీదుగా ప్రారంబం
విజయవాడ నగరం మరో అద్భుత ఘట్టానికి సాక్షీభూతంగా నిలవనుంది. నగరం నడిబొడ్డున ప్రపంచంలోనే పెద్దదైన 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహవిష్కరణ జరగబోతోంది. జనవరి 19న ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న అంబేద్కర్ విగ్రహావిష్కరణ, ,అంబేద్కర్ స్మృతివనం కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల్నించి భారీ సంఖ్యలో ప్రజానీకం వచ్చే అవకాశాలు ఉన్నందున అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 1 లక్షా 20 వేలమంది సమక్షంలో ఈ మహోత్సవం కనుల పండువగా జరగనుంద.
ఒక గొప్ప మార్పు జరిగింది రాష్ట్రంలో- జగన్
ఈ ఆవిష్కరణ గురించి ఎపి సియం జగన్ మాట్లాడుతూ ..దాదాపుగా 19 ఎకరాల్లో125 అడుగుల బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరుగుతోంది.సోషల్ జస్టిస్ కు ప్రతి రూపంగా, నిదర్శనంగా ఈ కార్యక్రమం జరుగుతుంది.సచివాలయం స్థాయినుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకూ ప్రతీ అడుగులోనూ కూడా ఈ సోషల్ జస్టిస్ కు సంభందించిన సందేశం ఉంటుంది. గ్రామ స్వరాజ్యం అంటే ఏంటి అనేదానికి అర్థం చెప్తూ .. గ్రామ స్థాయిలోనూ పరిపాలన అనటానికి మీనింగ్ తెలియజేస్తూ కరప్షన్ లేని వ్యవస్థ,వివక్షకు తావులేని వ్యవస్థను గ్రామ స్తాయిలో ఈరోజు తేగలిగాము అంటే ..నిజంగా ఒక గొప్ప మార్పు జరిగింది రాష్ట్రంలో. ఈ మార్పుకు ప్రతి రూపంగా ఈ నెల 19 వ తారీఖున ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాం అంటూ ఏపి సిఎం జగన్ ఈ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవం గురించి చెప్పారు.
స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్
విజయవాడ స్వరాజ్ మైదానంలో 400 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసిన 125 అడుగుల విగ్రహం అంబేద్కర్ స్మృతివనం ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంది.స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ గా ప్రాచుర్యంలోకి రానున్న ఈ
అంబేద్కర్ విగ్రహం ఎత్తు 125 అడుగులు కాగా పెడస్టల్ ఎత్తు 85 అడుగులుంటుంది. మొత్తంగా 210 అడుగుల ఎత్తులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఠీవిగా నిల్చుని ఉంటుంది. దాదాపు 19 ఎకరాల్లో ఏర్పాటైన స్మృతివనంలో అంబేద్కర్ ఫోటో గ్యాలరీ, జీవిత విశేషాలు, శిల్పాలు కనువిందు చేస్తాయి. ఓ కన్వెన్షన్ హాల్, ఫుడ్ కోర్టులు కూడా ఉన్నాయి.
అంబేద్కర్ విగ్రహం ఎత్తు 125 అడుగులు కాగా పెడస్టల్ ఎత్తు 85 అడుగులుంటుంది. మొత్తంగా 210 అడుగుల ఎత్తులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఠీవిగా నిల్చుని ఉంటుంది. దాదాపు 19 ఎకరాల్లో ఏర్పాటైన స్మృతివనంలో అంబేద్కర్ ఫోటో గ్యాలరీ, జీవిత విశేషాలు, శిల్పాలు కనువిందు చేస్తాయి. ఓ కన్వెన్షన్ హాల్, ఫుడ్ కోర్టులు కూడా ఉన్నాయి.
ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహం
ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ విగ్రహం మన దేశంలో అత్యంత బారీ విగ్రహాల్లో మూడవది కావడం గమనార్హం.అందులో మొట్టమొదటిది స్టాట్యూ ఆఫ్ యూనిటీగా పేరు ప్రసిద్ధిచెందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం. ఈ విగ్రహం ఎత్తు 597 అడుగులు ఉంటుంది. ఇక.. రెండవ విగ్రహం శంషాభాద్ సమీపంలో నిర్మించిన స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమతామూర్తి విగ్రహం. పంచలోహాలతో నిర్మించిన ఈ విగ్రహం ఎత్తు 216 అడుగులు ఉంటుంది. ఇక మూడో విగ్రహం ఈ నెల 19న విజయవాడలో ఆవిస్క్రుతం కానున్న 210 అడుగుల ఎత్తుగల స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం.
Advertisment