World Tribal Day: ఏపీలో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు!

ఏపీలోని రాజమహేంద్రవరంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలను జిల్లా కలెక్టర్ ప్రశాంతి అధికారులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఆదివాసీలందరికీ శుభాకాంక్షలు చెబుతూ, ఆదివాసులకు మద్దతుగా ఆర్ట్స్ కాలేజ్ నుంచి కంబాల చెరువు వరకు ర్యాలీ చేపట్టారు.

New Update
World Tribal Day: ఏపీలో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు!

World Tribal Day: ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు విశ్వవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో (Rajamahendravaram) ప్రభుత్వ అధికారుల ఆద్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ప్రశాంతి (Collector P Prasanthi).. ఆదివాసీలందరికీ శుభాకాంక్షలు చెబుతూ, ఆదివాసులకు మద్దతుగా ఆర్ట్స్ కాలేజ్ నుండి కంబాల చెరువు వరకు ర్యాలీ చేపట్టారు.

ఎమ్మెల్యే భక్తులు బలరామకృష్ణ, జిల్లా ఎస్పీ కిషోర్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివాసీల కోసం కార్యక్రమాలు చేపట్టారు. ఆదివాసుల కోసం సేవలందించిన వారందరిని ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి సత్కరించారు. ఆదివాసి ఇనిస్టిట్యూషన్ లో చదువుతున్న పిల్లలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇస్తామని, పలు అభివృద్ధి కార్యక్రమాలను త్వరలోనే చేపడతామని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు.

Advertisment
తాజా కథనాలు