World Science Day 2023: ఈరోజు వరల్డ్ సైన్స్‌ డే.. దీని ప్రాముఖ్యత ఏంటో తెలుసా.. ?

ప్రపంచవ్యాప్తంగా ఏటా నవంబర్ 10 ప్రపంచ సైన్స్ డే ను జరుపుకుంటారు. శాంతి, అభివృద్ధి కోసం.. అలాగే రోజూవారి జీవితంలో సైన్స్ ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం ఈ ప్రపంచ విజ్ఞాన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది వరల్డ్ సైన్స్ డే థీమ్ ఏంటంటే 'విజ్ఞానంలో నమ్మకాన్ని పెంపొందించడం'

New Update
World Science Day 2023: ఈరోజు వరల్డ్ సైన్స్‌ డే.. దీని ప్రాముఖ్యత  ఏంటో తెలుసా.. ?

World Science Day 2023: శాంతి, అభివృద్ధి కోసం 'ప్రపంచ విజ్ఞాన దినోత్సవాన్ని' ఏటా నవంబర్ 10న జరుపుకుంటారు. ఈరోజు అనేది ఎంతో ప్రత్యేకమైనంది. ఎందుకంటే సమాజంలో ఉన్న సైన్స్ పాత్ర ప్రాముఖ్యతను ఇది తెలియజేస్తుంది. అలాగే మన రోజూవారి జీవితాలకు సైన్స్‌ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాలను కూడా సూచిస్తుంది. అయితే ప్రతీ ఏడాది 'ప్రపంచ సైన్స్‌ డే' ను చాలా దేశాల్లో జరుపుకుంటారు. అంతేకాదు దీనికి ప్రతీ సంవత్సరం ఓ థిమ్‌ కూడా ఉంటుంది. అయితే 2023 సైన్స్‌ డే కు కూడా ఓ కొత్త థీమ్‌ను తీసుకొచ్చారు. ఈసారి అది ఏంటంటే.. 'విజ్ఞానంలో నమ్మకాన్ని పెంపొందించడం' (Building Trust In Science). వాస్తవానికి సైన్స్‌పై నమ్మకం ఉన్నప్పుడే మన భవిష్యత్తును మార్చడంలో సైన్స్ పాత్ర నెరవేరుతుంది.

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల కోసం ఒక ఆధారిత పరిష్కారాన్ని అభివృద్ధి చేసేందుకు సైన్స్‌‌పై ఉన్న నమ్మకం ఒక ఇంధనంలాగా పనిచేస్తోంది. 1999లో హంగేరిలోని బుడాపెస్ట్‌లో జరిగిన ప్రపంచ విజ్ఞాన సదస్సు నుంచి.. ఈ ప్రపంచ సైన్స్ డే అనే ఆలోచన ఉద్భవించింది. శాంతి, సుస్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడంలో సైన్స్ పాత్ర గురించి చర్చించేందుకు శాస్త్రవేత్తలు, చట్ట రూపకర్తలు, ఇతర వాటాదారులు ఇలా అందరూ ఈ సదస్సుకు హాజరయ్యారు. అయితే ఈ సదస్సు నిర్వహించడం వల్ల వచ్చిన ఫలితం ఏంటటే.. '21 శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనేందుకు సైన్స్ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం అలాగే.. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం'.

Also Read: నా మూర్ఖత్వమే ఆయన్ను సీఎం చేసింది…జితన్ పై నితీశ్ కుమార్ వివాదస్పద వ్యాఖ్యలు..!!

ఇక 2001లో యునెస్కో (UNESCO).. ప్రతి ఏటా ప్రపంచ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకోవాలని ఓ తీర్మానాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ తీర్మానం శాంతి, సుస్థిరమైన అభివృద్ధి కోసం సైన్స్ పాత్ర ఉంటుందని గుర్తించింది. అలాగే సమాజంలో సైన్స్ పోషిస్తున్న పాత్రపై ప్రజల్లో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చింది. వాస్తవానికి ఈ వరల్డ్ సైన్స్ డే జరుపుకోవడం అనేది ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే విజ్ఞాన రంగంలో వస్తున్న మార్పు, అభివృద్ధి గురించి ప్రజలకు దీనిద్వారా మరింత అవగాహన కల్పించవచ్చు. మన రోజువారి జీవితాల్లో సైన్స్ ఏ విధంగా ప్రభావితమవుతుందనే దాన్ని ఇది గుర్తుచేస్తుంది. ప్రభుత్వ అధికారుల నుంచి పాఠశాల విద్యార్థుల వరకు ఇలా అన్ని రంగాల వారు సైన్స్‌ పట్ల చూపించే ప్రోత్సహాన్ని.. అలాగే ఉజ్వల భవిష్యత్తును రూపొందించడంలో దాని సామర్థాన్ని ఏకం చేసేందుకు.. ఈ వరల్డ్‌ సైన్స్ డే అనేది శక్తినిస్తుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు