Mumbai: ప్రపంచంలోనే అత్యంత రిచ్ బిచ్చగాడు..ముంబైలో విలువైన ఆస్తులు

పేరుకు బిచ్చగాడు..కానీ చాల రిచ్. ముంబైలో ప్రపంచంలో అత్యంత సంపన్న బెగ్గర్ ఉన్నాడంటే నమ్మగలరా..కానీ నిజంగానే ఉన్నాడు. ముంబైలో ఉండే భరత్ జైన్..ప్రపంచంలోనే అత్యంత సంపన్న బిచ్చగాడు. ఇతని స్టోరీ వింటే వావ్ అనక మానరు.

New Update
Mumbai: ప్రపంచంలోనే అత్యంత రిచ్ బిచ్చగాడు..ముంబైలో విలువైన ఆస్తులు

Rich Begger In Mumbai: భారత దేశంలో చాలా మంది బిచ్చమెత్తుకుంటూ ఉంటారు. రోడ్ల మీద, గుడి ముందు ఇలా చోట్ల బిచ్చగాళ్లు కనిపిస్తుంటారు. రోజుకు వీళ్ళు పదో పరకో సంపాదించి...ఆరోజు గడిపేస్తుంటారు. వీళ్ళు ఎంత సంపాదించినా మామూలు జీవితం గడపలేరు. ఏ రోజు సంపాదన ఆరోజుకే సరిపోతుంటుంది. ఇందులో చాలా మందికి అవయవాలు సరిగ్గా లేక ఏ పనీ చేయలేక బిచ్చమెత్తుకుంటారు. మరికొందరు అన్ని సరిగ్గానే ఉన్నా పని చేయడం ఇష్టం లేకనో...లేక మరె ఇతర కారణాల వల్లనో అడుక్కుంటుంటారు. కానీ మన దేశంలో ఇలాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు. వీళ్ళ వెనుక ఒక దందా కూడా ఉంటుందని అంటుంటారు. కొంతమంది గ్రూప్‌గా ఏర్పడి దీన్ని ఒక వ్యాపారంగా కూడా చేస్తుంటారని చెబుతుంటారు. చాలా సినిమాల్లో ఇలాంటివి చూపించారు కూడా. ఏదేమైనా బిచ్చమెత్తుకోవడం తప్పని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో చాలా మంది బిచ్చమెత్తుకుంటుంటారు.

ఇలాంటి జీవితమే ముంబైలో ఉండే భరత్ జైన్‌ది కూడా. చిన్నప్పటి నుంచీ ఉన్న ఆర్ధిక ఇబ్బందులే అతణ్ణి బిచ్చగాడిగామార్చాయి. తినడానికి తిండి లేని పరిస్థితుల్లో బిచ్చగాడిగా మారిన భరత్..పెద్దయ్యాక కూడా అదే జీవితాన్ని కొనసాగించాడు. చదువుకోవాలని ఉన్నా డబ్బులు లేక చేయలేకపోయాడు. అయితే అడుక్కుతింటూనే ఇతను తన జీవితాన్ని కొనసాగించాడు. పెళ్ళి చేసుకున్నాడు. పిల్లలని కన్నాడు. అయితే తన పిల్లలు మాత్రం తనలా పెరగాలనుకోలేదు. అందుకే తాను అడుక్కుంటూనే పిల్లలను మాత్రం బాగా చదివిస్తున్నాడు.

ఇప్పుడు భరత్ జైన్ జీవితం చాలా బాగుపడింది. అడుక్కుంటూనే ఇతను ప్రపంచంలోనే అత్యంత రిచ్ మ్యాన్ అయ్యాడు. ఇప్పుడు భరత్‌కు ముంబైలో 1.4 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ ఉంది. దాంతో పాటూ రెండు షాపులు ఉన్నాయి. ప్రస్తుతం ఇతని ఆదాయం నెలకు 60 వేల నుంచి 75 మధ్యలో ఉంటుంది. భరత్ ఆస్తుల నిక విలువ 7.5 కోట్లు. ఇతను రెండు షాపుల్లో పెట్టుబడులు పెట్టాడు. దాని ద్వారా నెలకు 30వేలు సంపాదిస్తున్నాడు కూడా. అయితే ఇన్ని ఉన్నా భరత్ తన పాత జీవితాన్ని మర్చిపోలేదు. తనను ఏ వృత్తి అయితే ఇంత స్థాయికి తీసుకు వచ్చిందో దానిని వదిలిపెట్టలేదు. ఇప్పటికీ భరత్ ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్ లేదా ఆజాద్ మైదానం దగ్గర బిచ్చమెత్తుకుంటూ కనిపిస్తాడు.

Also Read:Dubai:రోబోలు కూడా వదలడం లేదు..యాంకర్‌తో అనుచితంగా ప్రవర్తించిన మరమనిషి

Advertisment
తాజా కథనాలు