Gold Demand May Increase: భారతదేశంలో ఈ ఏడాది అంటే, 2024లో బంగారం డిమాండ్ 800-900 టన్నుల మధ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంటే WGC మేనేజింగ్ డైరెక్టర్ (ఇండియా) సోమసుందరం పీఆర్ (Somasundaram PR) చెబుతున్నదాని ప్రకారం, భారతదేశంలో (India) బంగారం డిమాండ్ 2019 నుండి 700-800 టన్నుల పరిధిలో ఉంది. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో బంగారం కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంది. రుతుపవనాలు బాగున్నందున బంగారానికి డిమాండ్ పెరుగుతుందని, సార్వత్రిక ఎన్నికల తర్వాత బంగారానికి డిమాండ్(Gold Demand) పెరిగే అవకాశం ఉంది. ఆర్థికాభివృద్ధి, ప్రజల ఆదాయం పెరగడం వల్ల బంగారానికి డిమాండ్ పెరుగుతుందని సోమసుందరం పీఆర్ అభిప్రాయపడ్డారు.
2023లో భారతదేశంలో బంగారానికి డిమాండ్ 745.7 టన్నులుగా నమోదైందని, ఇది గత ఏడాది కంటే 3 శాతం తక్కువని WGC ఇటీవల ఒక రిపోర్టులో పేర్కొంది. వాస్తవానికి, 2023 లో, బంగారం ధర (Gold Rate) రికార్డు స్థాయికి చేరుకుంది. దీని కారణంగా డిమాండ్ తగ్గుదల గరిష్టంగా నమోదు అయింది. 2023 సంవత్సరంలో, భారతదేశంలో బంగారం డిమాండ్ 4 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకుందని సోమసుందరం పిఆర్ చెప్పారు. బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశం భారత్ కావడం గమనార్హం. స్విట్జర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పెరూ, ఘనా భారతదేశానికి బంగారం ఎగుమతి చేసే ప్రధాన సరఫరాదారులు. ప్రస్తుతం బంగారానికి మంచి డిమాండ్ ఉందని, అయితే ప్రజలు బంగారం ధరలో కొంచెం స్థిరత్వాన్ని కోరుకుంటున్నారని ఆయన అన్నారు.
Also Read: ఫుల్లుగా మందేసిన చిరుత.. ఆడేసుకున్న జనాలు!
వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాల కారణంగా ధరలు పెరగవచ్చు..
బంగారం ధర తగ్గితే డిమాండ్ బాగా పెరుగుతుందని అంటున్నారు. భౌగోళిక రాజకీయ వైరుధ్యాలు, ప్రముఖ ఆర్థిక వ్యవస్థలలో నెమ్మదించిన వృద్ధి అలాగే, అధిక ద్రవ్యోల్బణం (Inflation) మధ్య కేంద్ర బ్యాంకుల కఠినత్వం మధ్య బంగారం ధరలు కొంతకాలం అస్థిరంగానే ఉంటాయని అంచనా. అయితే, ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రధాన కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉందని, దీంతో బంగారం డిమాండ్ పెరగవచ్చని ఆయన అంటున్నారు.
Watch this Interesting Video :