Gold Demand: ఈ ఏడాది బంగారం డిమాండ్ మరింత పెరుగుతుందట.. ఎందుకంటే..
గతేడాది భారత్ లో బంగారం డిమాండ్ బాగా తగ్గింది. అయితే, ఈ సంవత్సరం బంగారం డిమాండ్ పెరిగే అవకాశం ఉందని WGC మేనేజింగ్ డైరెక్టర్ (ఇండియా) సోమసుందరం పీఆర్ అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత బంగారానికి డిమాండ్ పెరిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేస్తున్నారు.