అంతరిక్షంలోకి వరల్డ్​ కప్​ ట్రోఫీ.. మోదీ స్టేడియంలో ల్యాండ్​

ఈ ఏడాది జరగనున్న ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్‌కు సంబంధించి అరుదైన, ఆసక్తికరమైన ఘటన జరిగింది. విజేతకు బహుకరించే వరల్డ్ కప్‌ ట్రోఫీని ఏకంగా అంతరిక్షంలో ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ రిలీజ్​ చేసింది.

New Update
అంతరిక్షంలోకి వరల్డ్​ కప్​ ట్రోఫీ.. మోదీ స్టేడియంలో ల్యాండ్​
World Cup trophy in space.. Landed at Modi Stadium
 ఊహించని రీతిలో.. 

ఐసీసీ పురుషుల ప్రపంచ కప్ 2023 ట్రోఫీ వరల్డ్ టూర్​కు సిద్ధమైంది. అయితే ఈ టూర్​ను ఎవరూ ఊహించని రీతిలో స్పేస్​లో లాంఛ్​ చేసి ఆశ్చర్యపరిచారు నిర్వాహకులు. భూమికి లక్షా 20 వేల అడుగుల ఎత్తులో స్ట్రాటోస్పియర్​లో ఈ ట్రోఫీని ప్రవేశపెట్టడం విశేషం. ఆ తర్వాత ట్రోఫీని నేరుగా అహ్మదాబాద్​ నరేంద్ర మోదీ స్టేడియంలో ల్యాండ్ చేశారు.

18 దేశాల్లో ప్రపంచ యాత్ర

ఈ ప్రపంచ కప్ ట్రోఫీ ఇవాళ్టి నుంచి 100 రోజుల పాటు 18 దేశాల్లో ప్రపంచ యాత్రకు బయలుదేరనుంది. ఈ సందర్భంగా ట్రోఫీని స్పేస్​లో లాంఛ్​ చేయడానికి సిద్ధం చేసినప్పటి నుంచి నరేంద్ర మోదీ స్టేడియంలో ల్యాండ్​ అయ్యే వరకూ 3 నిమిషాల వీడియోను ఐసీసీ పోస్​ చేసింది. కాగా, 2023 వన్డే వరల్డ్ కప్​ను భారత్​ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రపంచ కప్​ ట్రోఫీని స్ట్రాటోస్పియరిక్ బెలూన్​కు కట్టి అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. భూమికి లక్షా 20 వేల అడుగుల ఎత్తులో ఉంచారు. ట్రోఫీ అంతరిక్షంలో ఉన్న ఫొటోలు, వీడియోలను 4కే కెమెరాలతో షూట్​ చేశారు.

నేరుగా చూసే అవకాశం

భారత్​లో ప్రారంభమయ్యే ఈ ట్రోఫీ టూర్​..  ఫ్రాన్స్, ఇటలీ, శ్రీలంక, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కువైట్, బహ్రెయిన్, మలేషియా, యూఎస్ఏ, నైజీరియా, ఉగాండా, ఇంగ్లాంజ్​, సౌతాఫ్రికా లాంటి అనేక దేశాల్లో పర్యటించనుంది. నేటి నుంచి జులై 14 వరకూ భారత్​లోని ట్రోఫీ పర్యటన ఉంటుంది. ఆ తర్వాత ఇతర దేశాలకు వెళ్లి.. తిరిగి సెప్టెంబర్ 4న భారత్​కు చేరుకుంటుంది. దాదాపు 10 లక్షల మంది ఈ ట్రోఫీని నేరుగా చూసే అవకాశం కూడా కల్పించనున్నారు నిర్వాహకులు.

Advertisment
Advertisment
తాజా కథనాలు