World Cup 2023: అదే జరిగితే సెమీస్ లో భారత్-పాక్ పోరు.. ఆ ఛాన్స్ ఎంత? By KVD Varma 03 Nov 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి World Cup 2023: వరల్డ్ కప్ లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. మ్యాచ్ మ్యాచ్ కూ టీమిండియా (Team India) దూకుడు పెంచుతూ దూసుకుపోతోంది. ఈ క్రమంలో శ్రీలంకను చిత్తుగా ఓడించి వరుసగా ఏడో విజయాన్ని నమోదు చేసి సెమీస్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఇక భారత్ రెండు మ్యాచ్ లు మాత్రమే ఆడాల్సి ఉంది. ఈ రెండూ గెలిస్తే పాయింట్స్ టేబుల్ లో టాప్ ప్లేస్ లో ఉంటుంది. భారత్ తరువాత పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా (12), ఆస్ట్రేలియా (8), న్యూజీలాండ్ (8),పాకిస్తాన్ (6) వరుసగా ఉన్నాయి. ప్రస్తుతం నాలుగో స్థానంలో న్యూజీలాండ్.. ఐదో స్థానంలో పాకిస్తాన్ (Pakistan) ఉన్నాయి. ఈ రెండు టీమ్స్ రేపు అంటే నవంబర్ 4వ తేదీన తలపడబోతున్నాయి. వీటి మధ్య విజేత నాలుగో స్థానాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంది. Also Read: Shami - మూడు సార్లు చనిపోదాం అనుకున్నాడు.. కట్ చేస్తే ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్నాడు! ఈ సమీకరణాలు పరిశీలిస్తే కనుక పాకిస్తాన్ నాలుగో స్థానం చేరుకునే అవకాశాలను కొట్టిపారేయలేం. అదే కనుక జరిగితే సెమీస్ లో భారత్-పాక్ (India vs Pakistan) మధ్య పోటీ తప్పదు. మరోవైపు న్యూజీలాండ్ ఇంకా రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అందులో ఒకటి పాకిస్తాన్ పై.. రెండోది శ్రీలంకపై.. ఒకవేళ న్యూజీలాండ్ పాక్ పై ఓడిపోయి.. శ్రీలంక పై గెలిస్తే కనుక అప్పుడు నాలుగో స్థానంలో న్యూజీలాండ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. మరోవైపు పాకిస్తాన్ న్యూజీలాండ్ పై గెలిచి.. చివరి మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై గెలిస్తే ఎటువంటి లెక్కలు అవసరం లేకుండా సెమీస్ కోసం నాలుగో బెర్త్ ఖాయం చేసుకుంటుంది. పాకిస్తాన్ న్యూజీలాండ్ పై ఓడిపోతే.. ఆ జట్టుకు సెమీస్ దారులు పూర్తిగా మూసుకుపోతాయి. ఒకవేళ పాకిస్తాన్ కనుక నాలుగో స్థానానికి చేరితే.. వరల్డ్ కప్ టోర్నీ హిస్టరీలో రెండోసారి భారత్-పాక్ జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. చివరిసారిగా 2011 ప్రపంచ కప్ లో ఈ రెండు జట్లూ సెమీస్ లో ఢీ కొన్నాయి. అప్పుడు టీమిండియా విజయకేతనం ఎగరవేసింది. 2023 వన్డే వరల్డ్ కప్ (World Cup 2023) లో సెమీస్ చేరిన తొలి జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. ఈ టోర్నీలో శ్రీలంకను ఓడించి భారత్ వరుసగా ఏడో విజయాన్ని నమోదు చేసి నాకౌట్ కు అర్హత సాధించింది. టీమిండియాకు ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉండగా, ఈ మ్యాచ్లో గెలిస్తే పాయింట్ల పట్టికలో నెంబర్-1 స్థానానికి చేరుకుంటుంది. మరోవైపు సెమీఫైనల్ రేసులో పాక్ జట్టు రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించి నాలుగో స్థానానికి చేరుకునే అవకాశాలు కొట్టిపారేయలేం. ఒకవేళ నాలుగో స్థానంలో న్యూజీలాండ్ చేరుకుంటే భారత్-న్యూజీలాండ్ మధ్య సెమీస్ నవంబర్ 15న ముంబయిలో జరుగుతుంది. ఒకవేళ పాకిస్తాన్ తో సెమీస్ లో భారత్ తలపడవలసి వస్తే ఆ మ్యాచ్ నవంబర్ 16న కోల్ కతా లో జరుగుతుంది. Also Read: ఈ ఫొటోకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది..సచిన్ ఎమోషనల్ పోస్ట్..! #india-vs-pakistan #icc-world-cup-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి