World cup 2023: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. న్యూజిలాండ్‌పై మనం చివరి సారి గెలిచినప్పుడు గిల్ వయసు 4 ఏళ్లే!

ఐసీసీ టోర్నమెంట్లలో 20ఏళ్ల నిరీక్షణకు భారత్ తెరదించింది. వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌పై భారత్‌ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. కివీస్‌పై మార్చి,14 2003 తర్వాత ఐసీసీ టోర్నమెంట్లలో గెలవలేదు. ఆ సమయానికి గిల్‌ వయసు 4ఏళ్లేనంటూ సోషల్‌మీడియాలో ట్వీట్లు షేర్ అవుతున్నాయి. అప్పటికీ సచిన్‌ 65 అంతర్జాతీయ సెంచరీలు మాత్రమే చేసి ఉన్నాడంటూ ట్వీట్లు వేస్తున్నారు.

World cup 2023: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. న్యూజిలాండ్‌పై మనం చివరి సారి గెలిచినప్పుడు గిల్ వయసు 4 ఏళ్లే!
New Update

వరల్డ్‌కప్‌లో టీమిండియా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది. టోర్నీలో ఇప్పటివరకు అసలు ఓటమే ఎరుగని జట్టు భారత్. రోహిత్ శర్మ కెప్టెన్సీలో అదరగొడుతోన్న భారత్‌ జట్టు టేబుల్‌ టాపర్‌గా ఉన్న న్యూజిలాండ్‌ను చిత్తు చేసి అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. ఈ మ్యాచ్‌ గెలుపునతో టీమిండియా 20ఏళ్ల నిరీక్షణకు తెరదించినట్టు అయ్యింది. వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌పై భారత్ చివరి సారిగా 2003లో గెలిచింది. అప్పటినుంచి ఐసీసీ టోర్నమెంట్లలో కివీస్‌పై భారత్ గెలవలేదు. 14 మార్చి,2003న ఈ మ్యాచ్‌ జరిగింది.

Also Read: టీమిండియా దిగ్గజ స్పిన్నర్, మాజీ కెప్టెన్ మృతి..!

అప్పుడు గిల్ ఏజ్‌ 4ఏళ్లే:
ఐసీసీ టోర్నమెంట్లలో న్యూజిలాండ్‌పై భారత్‌ 2003 ప్రపంచకప్‌లో విజయం సాధించింది. దీనికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్‌ విషయాలు సోషల్‌మీడియాలో ఫుల్‌గా షేర్ అవుతున్నాయి. 2003లో న్యూజిలాండ్‌పై భారత్‌పై గెలిచిన టైమ్‌కి సచిన్‌ 65 సెంచరీలు మాత్రమే చేసి ఉన్నాడు. తర్వాత కాలంలో సచిన్‌ వంద సెంచరీలు చేశాడు. ఇక ఆ సమయంలో అప్పటికీ టీ20 మ్యాచ్‌లు పుట్టనేలేదు. ఆ తర్వాతి కాలంలో టీ20 మ్యాచ్‌లు క్రికెట్‌ను శాసించే స్థాయికి వచ్చాయి. ఇక ఆ సమయానికి ఆస్ట్రేలియాకు రెండు వరల్డ్‌కప్‌లే ఉన్నాయి. ధోనీ అప్పటీకీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ కూడా ఇవ్వలేదు. ఇక అన్నిటికంటే ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. న్యూజిలాండ్‌పై ఓపెనర్‌గా బరిలోకి దిగిన టీమిండియా యువ సంచలనం శుభమన్‌గిల్‌ ఆ సమయానికి నాలుగేళ్ల చిన్నపిల్లోడు.

అదరగొట్టిన కోహ్లీ, రోహిత్:
నిన్నటి మ్యాచ్‌లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 274 పరుగులు లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన టీమిండియాకు భారత్ ఓపెనర్లు అదిరిపోయే స్టార్ట్ ఇచ్చారు. 40 బంతుల్లో 46 రన్స్ చేశాడు రోహిత్ శర్మ. అందులో ఏకంగా నాలుగు సిక్సులు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. మరో ఎండ్‌లో గిల్‌ కూడ మంచి క్లాస్‌ కనబరిచాడు. 31 బంతుల్లో 26 పరుగులు చేసిన గిల్‌.. లాకీ ఫెర్గుసన్‌కు అవుట్ అయ్యాడు. ఆ తర్వాత అయ్యర్ 29 బాల్స్ లో 33 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన రాహుల్ కోహ్లీకి సపోర్ట్ గా నిలిచాడు. 35 బంతుల్లో 27 రన్స్ చేసిన రాహుల్ సాంట్నర్ కి అవుట్ అయ్యాడు. ఇక సూర్యకుమార్‌ యాదవ్‌ ఇలా వచ్చి అలా అవుట్ అయ్యాడు. కోహ్లీతో సమన్వయ లోపం వల్ల సూర్యకుమార్‌ రన్‌ అవుట్ కావాల్సి వచ్చింది. వరల్డ్‌కప్‌లో ఇది అతనికి తొలి మ్యాచ్‌.  ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన జడేజా తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదింది ఈ జంట. కోహ్లీ సెంచరీ చేస్తాడని అంతా భావించారు. 5 పరుగులు చేస్తే కోహ్లీ సెంచరీతో పాటు ఇండియా గెలుస్తుంది. ఈ సమయంలో కోహ్లీ అవుట్ అయ్యాడు. ఇక తర్వాత దిగిన షమి, జడేజాతో కలిసి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఇక ఈ మ్యాచ్ లో ఐదు వికెట్లు తీసిన షమీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Also Read: రోహిత్ శర్మ వల్లే గెలుస్తున్నాం.. ఎందుకో తెలుసుకోండి..!

#icc-world-cup-2023 #india-vs-newzealand
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe