World cup 2023: ధోనీ ఫ్యాన్స్‌కు అశ్విన్‌ ఝలక్‌.. గంభీర్‌ గురించి అలా మాట్లాడతారా?

ఇటివలి కాలంలో ధోనీ, కోహ్లీపై విమర్శలు చేస్తూ క్రికెట్‌ అభిమానుల ట్రోలింగ్‌కు గురవుతున్న మాజీ స్టార్‌ ఓపెనర్‌ గంభీర్‌పై టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతను ఎల్లప్పుడూ జట్టు గురించి ఆలోచించే నిస్వార్థ వ్యక్తి అని అశ్విన్ కొనియాడారు. గంభీర్‌ టీమ్‌ మ్యాన్‌ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు.

World cup 2023: ధోనీ ఫ్యాన్స్‌కు అశ్విన్‌ ఝలక్‌.. గంభీర్‌ గురించి అలా మాట్లాడతారా?
New Update

క్రికెట్‌లో గంభీర్‌ రూటు సపరేటు.. టీమిండియాకు వరల్డ్‌కప్‌(టీ20, వన్డే) రావడంతో కీలక పాత్ర పోషించిన గంభీర్‌ ఆటను తీసి పడేసేలాగా ఎవరైనా మాట్లాడితే అది కచ్చితంగా కోపం లేదా అసూయతో వచ్చిన మాటలే కానీ వాటిలో ఏ మాత్రం నిజం ఉండదు. అయితే విన్నింగ్‌ క్రెడిట్ల విషయంలో ధోనీ ఫ్యాన్స్‌ అతిగా బిహేవ్ చేస్తుంటారని.. అతని పీఆర్‌ టీమ్‌ వల్ల 2011 ప్రపంచకప్‌ గెలుపు క్రెడిట్‌ ధోనీ ఖాతాలోకి వెళ్లిందని గంభీర్‌ అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అది ధోనీ గెలుపు కాదు అని.. టీమిండియా గెలుపు అని కుండబద్దలు కొట్టడంలో గంభీర్‌ స్టైల్‌ వేరు. ఇటు కోహ్లీని విమర్శించడంలోనూ గంభీర్ చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఇలా వివిధ కారణాలతో గంభీర్‌ని హేట్ చేసే టీమిండియా అభిమానులు పెరిగిపోయారు. అతడిని, అతని ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతుంటారు. అయినా గంభీర్‌ ఇవేమీ పట్టించుకోడు. తాను చెప్పాలనుకున్నది నేరుగా చెప్పేస్తాడు. అందుకే అతడిని తప్పుగా అర్థం చేసుకునేవాళ్లే ఎక్కువ. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

CLICK HERE TO VIEW RTV WHATSAPP CHANNEL: మరిన్ని ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ కావాలా? ఆర్టీవీ వాట్సాప్‌ ఛానెల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేసి వార్తలను చూడండి

అశ్విన్ ఏం అన్నాడంటే?
ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ(గంభీర్‌)పై ప్రజలు చాలా కఠినంగా ఉన్నారని, భారత క్రికెట్‌కు గౌతీ(Gambhir) చేసిన అపారమైన సేవలకు చాలా తక్కువ క్రెడిట్ దక్కుతుందని రవిచంద్రన్ అశ్విన్(Ashwin) అభిప్రాయపడ్డాడు. గంభీర్‌పై అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత జట్టు ఆటగాళ్లలో కొందరిపై నిర్మొహమాటంగా, నిజాయితీగా విమర్శలు చేసిన గౌతమ్ గంభీర్ ఇటీవల తప్పుడు కారణాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీలపై గంభీర్ విమర్శలు చేసినప్పుడల్లా భారత క్రికెట్ అభిమానులు అతడిని హైలెట్ చేస్తుంటారు. తిడుతుంటారు.

టీమ్‌ మ్యాన్‌:
'భారత్‌లో గౌతమ్ గంభీర్‌కు దక్కాల్సిన క్రెడిట్లు దక్కలేదు. అతడే గొప్ప టీమ్ మ్యాన్. అతను ఎల్లప్పుడూ జట్టు గురించి ఆలోచించే నిస్వార్థ వ్యక్తి' అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో గెలిచిన రెండు ప్రపంచకప్ ఫైనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గంభీర్ నిలిచాడు. 2007 టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్లో జోహన్నెస్ బర్గ్ లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 75 పరుగులు చేశాడు గంభీర్‌. 2011 వరల్డ్‌కప్‌లో ముంబైలో శ్రీలంకపై జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 97 పరుగులు చేశాడు. భారత్ ఈ రెండు మ్యాచ్ ల్లో గెలిచి ప్రపంచకప్ టైటిల్స్ ను సొంతం చేసుకున్నప్పటికీ గంభీర్ కు రెండు ఫైనల్స్ లోనూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కలేదు. అయినా కూడా గంభీర్‌ ఆడిన ఆట అభిమానుల గుండెల్లో ఇప్పటికీ పదిలంగానే ఉంది. కానీ గ్రూపులుగా విడిపోయి నిత్యం కొట్టుకునే టీమిండియా అభిమానులు కావాలని గంభీర్‌ని తక్కువ చేసి మాట్లాడుతుంటారన్న విమర్శలున్నాయి. గంభీర్ తన 12 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20లు ఆడి 4154, 5238, 932 పరుగులు చేశాడు. కోల్కతా నైట్ రైడర్స్‌కు నాయకత్వం వహిస్తూనే రెండు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిళ్లను కూడా గెలుచుకున్నాడు గౌతీ.

ALSO READ: ప్లీజ్ దయచేసి నన్ను అడగొద్దు…విరాట్ కోహ్లీ ఇన్స్టా పోస్ట్

#gautam-gambhir #ravichandran-ashwin #ms-dhoni
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి