/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/IND-vs-PAK-jpg.webp)
ICC World Cup 2023: వివిద దేశాల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్‌లు ఒక ఎత్తు.. భారత్-పాక్(IND vs PAK) మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ మరో ఎత్తు. భారత్-పాక్ మ్యాచ్ అంటే చాలు.. యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్(Cricket) అభిమానులు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తారు. మ్యాచ్ ఎక్కడ జరిగినా అక్కడికి వెళ్లి మరీ టికెట్ కొనుగోలు చేసి వీక్షిస్తారు. అలా వీలుకాని వారు ఇంట్లో టీవీల్లోనో, మొబైళ్లలోనూ చూస్తారు. ఇక దాయాది దేశాల క్రికెట్ పోరును గల్లీలలో ప్రొజెక్టర్లు వేసి మరీ వీక్షించిన సందర్భాలు ఉన్నాయి. అయితే, త్వరలో జరుగనున్న పురుషుల వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భారత్-పాకిస్తాన్ మధ్య కూడా మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లకు సంబంధించి టికెట్ల విక్రయం ప్రక్రియ నడుస్తోంది.
అయితే, వరల్డ్ కప్ 2023లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్లు సెకండరీ మార్కెట్‌లో రూ. 57 లక్షల వరకు పలుకుతున్నాయి. ఇందుకు సంబందించిన వివరాలను నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఈ రెండు దేశాల మధ్య క్రేజ్ ఆ రేంజ్‌లో ఉండొచ్చు గానీ.. మరీ ఇంత ధర ఎలా సాధ్యం అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఇది పూర్తిగా దోపిడీ అంటూ మండిపడుతున్నారు. భారత్-పాక్ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను వయాగోగోలో వెబ్‌సైట్‌లో రూ 57,62,676 లకు విక్రయిస్తున్నారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను నెటిజన్లు సోషల్ మీడియాలో పెట్టారు.
వయాగోగో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన టికెట్ల విక్రయ సంస్థ. ఈ వెబ్‌సైట్ వేదికగా భారత్-పాక్ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లను విక్రయించడం జరుగుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో సౌత్ ప్రీమియం వెస్ట్ 2 బ్లాక్ నుండి ఒక టికెట్ ధర రూ. 19 లక్షలకు పైగా విక్రయించారని నెటిజన్లు స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్నారు. ఇది మరీ దారుణం అని మండిపడుతున్నారు. ఇక వయాగోగోలో సౌత్ ప్రీమియం ఈస్ట్ 3 సెక్షన్ టికెట్ ప్రస్తుతం రూ. 21 లక్షలతో లిస్ట్ చేయబడిందని మరో నెటిజన్ స్క్రీన్‌షాట్ షేర్ చేశారు.
క్రికెట్ మ్యాచ్ టిక్కెట్లు విక్రయించే వయాగోగో.. ఆ టికెట్ల ధరలను భారీ ధరలకు విక్రయిస్తోందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధీకృత టికెటింగ్ భాగస్వామి అయిన BookMyShow ద్వారా అన్ని టిక్కెట్‌లను అధికారికంగా విక్రయించినప్పుడు ఇది ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్నలను ఇది లేవనెత్తుతున్నారు నెటిజన్లు. మొత్తం 1,32,000 టికెట్లలో ఎన్ని టికెట్‌లను విక్రయించారో తప్పనిసరిగా వెల్లడించాలంటూ @bookmyshow ని ట్యాగ్ చేస్తున్నారు నెటిజన్లు. అంతేకాదు.. అన్ని మ్యాచ్‌లకు సంబంధించిన డేటాను తప్పనిసరిగా అధికారికంగా వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. 'బ్లాక్ మార్కెట్ ఇప్పుడు హాట్‌గా ఉంది.. ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ ధరలను చూడండి.. ఇది 1.5 లక్షల నుండి మొదలవుతుంది. నేను లాంగ్ ఆన్ వ్యూతో రూ. 15 లక్షల టిక్కెట్‌ని చూశాను.. ఇది నిజంగా హాస్యాస్పదంగా ఉంది' అని ఓ నెటిజన్ రెస్పాండ్ అయ్యాడు.
ఇక వరల్డ్ కప్ 2023లో జరిగే ఇతర భారత్ మ్యాచ్‌లకు కూడా డిమాండ్ భారీగా ఉంది. టికెటింగ్ వెబ్‌సైట్‌లో, చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో భారత్ vs ఆస్ట్రేలియా మ్యాచ్ టిక్కెట్లు అత్యధికంగా రూ. 2.85 లక్షల ధరకు అమ్ముడవుతున్నాయి. లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ టిక్కెట్లు రూ. 2.35 లక్షలకు అమ్ముడవుతోంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ టిక్కెట్లు రూ. 2.35 లక్షలకు అమ్ముడవుతున్నాయి.
Also Read:
Miss Shetty Mr Polishetty: అనుష్క చికెన్ కర్రీ.. ప్రభాస్ పలావ్.. అభిమానులకు పసందే..